priyanka murder case:ఆ నలుగురు మృగాళ్లకు ఉరే సరి, క్యాండిల్ ర్యాలీలో టీడీపీ నేతలు

ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను తక్షణం ఉరి తీయాలని పౌర సమాజం కోరుతుంది. ప్రియాంకరెడ్డి హత్యకు సంఘీభావంగా టీడీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ర్యాలీగా వచ్చి.. కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. క్యాండిల్ ర్యాలీలో ఓ చిన్నారి కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

క్యాండిల్ ర్యాలీ

క్యాండిల్ ర్యాలీ


టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి సహా మహిళ నేతలు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంబడి లారీలను నిలిపేందుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే మద్యం విక్రయాలపై కూడా ఆంక్షలు ఉండాలని అభిప్రాయపడ్డారు. చట్టాలు కఠినంగా లేనప్పుడే మృగాలు రెచ్చిపోతాయని మండిపడ్డారు. మహ్మద్ అండ్ కోకు బహిరంగ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

 అక్కడే చంపాలి..

అక్కడే చంపాలి..

నిందితులను జైలులో మెపే బదులు.. ప్రియాంకను తగులబెట్టిన చోట చంపేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 9 గంటలకు పోలీసు స్టేషన్‌కు వెళ్లే పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో మహిళలకు రక్షణేదీ అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కూతురు కవితకు భద్రత కల్పిస్తారు.. మరి మిగతా వారి సంగతేంటి అని ప్రశ్నించారు. కవిత ఎంపీకాకున్న సెక్యూరిటీ ఉంటుంది... మిగతా ఆడపిల్లలు ఏం పాప చేశారని ప్రశ్నించారు.

 వి వాంట్ జస్టిస్..

వి వాంట్ జస్టిస్..

నిందితులకు త్వరితగతిన శిక్ష విధించి సమాజానికి మంచి సంకేతం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. చట్టం, న్యాయం అంటూ కాలం వెళ్లదీయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వరంగల్ ఘటనను గుర్తుచేశారు. మరోసారి ఎన్‌కౌంటర్ చేస్తే తప్ప మృగాళ్లలో భయం రాదని పేర్కొన్నారు.

బందీగా చిక్క

బందీగా చిక్క

బుధవారం రాత్రి మానవృగాలకు బందీగా చిక్కిన ప్రియాంకకు.. వారు చుక్కలు చూపించారు. తమ వద్ద ఉన్న మద్యం కూడా తాగించారనే కఠోర నిజం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యం చేశారని తెలుస్తోంది. అప్పుడు కూడా కేకలు పెట్టిన కీచకులు కరుణించలేదు. తమ వాంఛను తీర్చుకొని మట్టుబెట్టారు. ప్రియాంకను పెట్రోల్ పోసి తగలబెట్టిన నీచులు.. మళ్లీ వచ్చి చూశారంటే వారు ఎంత ప్రణాళిక ప్రకారం చేశారో అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+