ప్రియాంక రెడ్డి హత్య : పోలీస్‌స్టేషన్‌కు జిల్లా జడ్జ్... నిందితులకు 14 రోజుల రిమాండ్...

ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు మేజీస్ట్రేట్ ముందు హజరుపరిచారు. షాద్‌నగర్ పోలీసు స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుండడంతో మేజిస్ట్రేట్ సైతం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అనంతరం ఆయన ముందు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను హజరుపరిచారు. అనంతరం వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

స్టేషన్‌కు వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్

స్టేషన్‌కు వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్

అయితే నిందితులను ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా అందుకు పరిస్థితులు సహకరించడం లేదు. ప్రజలు పెద్ద పోలీస్ స్టేషన్‌ముందు బైఠాయించడంతో వారిని కనీసం బయటకు తీసుకులోని పరిస్థితి నెలకొంది. ఉదయం ముప్పై నలబై మందితో ప్రారంభమైన ఆందోళన వేలాది మందికి చేరుకోవడంతో లా అండ్ అర్డర్ సమస్య ఉత్పన్నమయ్యె అవకాశాలు ఉండడంతో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను రప్పించి పరీక్షలు నిర్వహించారు.

స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు

స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు

ఇక వైద్య పరీక్షల అనంతరం నిందితులను మేజిస్ట్రేట్ ముందు హజరు పరచాల్సి ఉండగా ..జిల్లా మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో స్టేషన్‌లోనే ఉంచారు. అయితే బయట పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో నిందితులకు బయటకు తీసుకువెళితే...ప్రజలు వారిపై దాడి చేసే అవకాశాలు ఉండడంతో మేజిస్ట్రేట్ పాండు నాయక్ సైతం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అనంతరం వారి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. జడ్డి ముందు నిందితులను ప్రవేశ పెట్టి విచారణ చేపట్టారు. ఇక విచారణ అనంతరం నిందితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించి వెళ్లి పోయారు. దీంతో వారిని మహబుబ్ నగర్ జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు తరలించనున్నారు.

స్టేషన్ ముందు ప్రజల ఆందోళన

స్టేషన్ ముందు ప్రజల ఆందోళన

షాద్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులకు రక్షణ ఇవ్వడం పోలీసులకు సవాల్‌గా మారింది. గత రాత్రి నుండి నిందితులను షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక ప్రజలతో పాటు ఇతర విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులను తమకు అప్పగించాలని వాడు డిమాండ్ చేస్తూ...అందోళన నిర్వహించారు.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    అందోళనకారులపై లాఠీచార్జ్...

    అందోళనకారులపై లాఠీచార్జ్...

    నిందితులకు పోలీస్‌స్టేషన్‌లోనే వైద్య పరీక్షలతో పాటు మేజిస్ట్రేట్ విచారణ కూడ పోలీస్టేషన్‌లోనే జరిగింది. దీంతో వారిని మహబుబ్ నగర్ జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. అయితే వారికి అడ్డుగా ఆందోళనలు కొనసాగుతుండడంతో...ఉదయం నుండి మధ్యహ్నాం వరకు వేచి చూసిన పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జీ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న షాపులతో పాటు, ఇతరులెవరిని స్టేషన్ ప్రాంగణంలో ఉండకుండా లాఠి ఝలిపించారు. సాయంత్రం ఆరుగంటలలోపు వారిని జిల్లా జైలుకు తరలించాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+