వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Priyanka Reddy murder: కేసును స్వయంగా పర్యవేక్షిస్తానన్న మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యపై చాలామంది నెటిజెన్లు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ కష్ట సమయంలో ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇక ప్రియాంకా రెడ్డి హత్యపై సెలబ్రిటీలు కూడా ట్వీట్ చేశారు. ఆమెకు నివాళులు అర్పిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాని ప్రార్థించారు.

ప్రియాంకా రెడ్డి హత్య ఎఫెక్ట్: మహిళలకు రోడ్లపై ఏ ఇబ్బంది ఉన్నా 100 కు కాల్ చెయ్యండి : డీజీపీ ప్రియాంకా రెడ్డి హత్య ఎఫెక్ట్: మహిళలకు రోడ్లపై ఏ ఇబ్బంది ఉన్నా 100 కు కాల్ చెయ్యండి : డీజీపీ

 ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో..

ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో..

బుధవారం రాత్రి మాధాపూర్‌లోని ఓ హాస్పిటల్‌కు తన స్కూటీపై వెళ్లి వస్తూ టైర్ పంక్చర్ కావడం ఆ తర్వాత కొందరు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. లారీలను అడ్డం పెట్టుకుని ఆమెపై దుండగులు అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. త్వరగా వస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్లిన ప్రియాంకా రెడ్డి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.

నేనే ఈ కేసును పర్యవేక్షిస్తాను: కేటీఆర్

ఇక ప్రియాంకా రెడ్డి హత్యకు గురికావడంపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని చెబుతూ ట్విటర్ వేదికగా తమ సందేశాన్ని పంపారు. సమాజంలో రాక్షసులు ఎక్కవైపోయారని పలువురు సెలబ్రిటీలు అన్నారు. మృగాళ్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మరొకరు ఇలాంటి తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా శిక్ష ఉండాలంటూ వారు అభిప్రాయపడ్డారు. ప్రియాంకా రెడ్డి హత్య తనను కలచివేసిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడ్డ మృగాళ్లను పోలీసులు వెంటనే పట్టుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కేసును తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 100 నెంబరుకు డయల్ చేయాలని కోరారు మంత్రి కేటీఆర్.

రేవంత్ రెడ్డి స్పందన

ప్రియాంకా రెడ్డి హత్య విషయం తెలుసుకుని కలత చెందినట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలకు అండగా నిలవాలని కోరారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రేవంత్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్యే రాజా సింగ్ ఏమన్నారంటే..

ప్రియాంకా రెడ్డి హత్యపై స్పందించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రియాంకారెడ్డిని అత్యాచారం చేసి హత్యచేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ డీజీపీని కోరారు. ఈ కష్టసమయంలో భగవంతుడు ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని రాజాసింగ్ కోరారు. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఆమె కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.

షాక్‌కు గురయ్యాను: మెహ్రీన్

మరోవైపు ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా రియాక్ట్ అయ్యింది. ప్రియాంకా రెడ్డిపై జరిగిన దారుణాన్ని తెలుసుకున్నట్లు చెప్పిన మెహ్రీన్ ఫిర్జాదా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ వార్త చూసి షాక్‌కు గురైనట్లు మెహ్రీన్ పేర్కొంది.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested

ప్రతి మహిళా పోలీసుల సహాయం తీసుకోవాలి

జరిగిన ఘటనపై హీరో సుధీర్ బాబు స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పిన సుధీర్ బాబు.. మహిళలు పోలీసుల సహాయం కోరాలని చెప్పారు. లైవ్ లొకేషన్ యాప్‌లను, ఎమర్జెన్సీ కాలింగ్ ఆప్షన్స్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ప్రియాంకా రెడ్డి నిష్కళంకమైన ఆత్మకు శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్ చేశారు. అంతేకాదు ఎమర్జెన్సీ నెంబర్లు ఉ్న పోస్టరును షేర్ చేశారు.

English summary
Netizens had strongly condemned the rape and Murder of Dr. Priyanka reddy and expressed their solidarity. Few Politicians and celebrities took to twitter and condemned this henious act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X