మహంకాళి గుడి ముందు మనిషితల కేసులో పురోగతి; సూర్యాపేట వ్యక్తిగా గుర్తింపు; నరబలిగా అనుమానం

తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని మెట్టు మహంకాళి దేవాలయం ముందు దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు గుర్తుతెలియని వ్యక్తి యొక్క తల భాగం ఆలయం ముందు కనిపించింది. ఇది హత్యనా? లేకా నరబలినా? అన్న అనుమానం వ్యక్తమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు.

మెట్టు మహంకాళి ఆలయం ముందు మనిషి తల కేసు

మెట్టు మహంకాళి ఆలయం ముందు మనిషి తల కేసు

నల్గొండ జిల్లా గొల్లపల్లి మండలం కుర్మేడు గ్రామ శివారులోని మెట్టు మహంకాళి ఆలయంలో అమ్మవారి పాదాల వద్ద ఓ వ్యక్తి తల కనిపించింది. ఆలయ పూజారి సోమవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకుని అమ్మవారి పాదాల వద్ద తల ఉండడం చూసి షాక్‌కు గురై పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆ ప్రాంతమంతా వ్యక్తి ఇతర శరీర భాగాల కోసం శోధించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ ఆవరణలోగానీ, పరిసర ప్రాంతాల్లోగానీ హత్య జరిగిన ఆనవాళ్లు పోలీసులకు దొరకలేడు.

కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలు

కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలు

30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని వేరే ప్రదేశంలో హత్య చేసి, అతని తలను ఆలయంలో పడేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు అన్నది గుర్తించడం కోసంపోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దింపారు. చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో దీనిపై హత్య కేసు నమోదైంది. బాధితుడిని గుర్తించేందుకు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మృతుడు సూర్యాపేటకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి

మృతుడు సూర్యాపేటకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి

ఘటనాస్థలం హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవేకి సమీపంలో ఉండటంతో హంతకులు బాధితుడి తలను వాహనంలో తీసుకెళ్లి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు బృందాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి మరికొన్ని ఆధారాలపై కసరత్తు చేస్తున్నాయి. ఇక ఈ కేసులో పురోగతి సాధించిన పోలీసులు మృతుడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యం కు చెందిన లేని జహెందర్ నాయక్ గా గుర్తించారు.

మృతుడి ఇతర శరీర భాగాల కోసం కొనసాగుతున్న గాలింపు

మృతుడి ఇతర శరీర భాగాల కోసం కొనసాగుతున్న గాలింపు

మతిస్థిమితం లేని జహెందర్ నాయక్ గత కొంత కాలంగా ఇబ్రహీంపట్నంలో ఉంటున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. జహెందర్ నాయక్ ఇతర శరీర భాగాల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని కాటన్ మిల్లులు, కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తున్నారు. అసలు మతి స్థిమితం లేని వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జహేందర్ నాయక్ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని వారిని కూడా విచారిస్తున్నారు. ఇది హత్యనా లేక నరబలినా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఇది కచ్చితంగా నరబలినే అని తేల్చి చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+