ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత..
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 8,1934లో గుంటూరులో జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు 50 ఏళ్ల పాటు పత్రికా రంగంలో సేవలందించారు.ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1957లో ఆంధ్రా జనత పత్రికతో ఆయన ప్రస్థానం మొదలైంది. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఉదయం,ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పారమార్థిక పదకోశం, నాటి పత్రికల మేటి విలువలు,చింతన,చిరస్మరణీయులు,విధి నా సారథి,వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంటి రచనలు చేశారు.
Recommended Video

Coronavirus (COVID-19) : Sales of Masks, Sanitizers Increased Across India | Oneindia Telugu













Click it and Unblock the Notifications