ఆ తర్వాతే సినీ స్టార్ల పేర్లు వెల్లడి, డబ్బుల్లేకపోతే నగ్న వీడియోలు పంపేవారు..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డ్రగ్స్ కేసుతో ఆందోళన చెందుతున్న చిత్ర పరిశ్రమకు మరో కుదుపు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన కెల్విన్‌ తన దగ్గర క్రమం తప్పకుండా డ్రగ్స్ కొంటున్న మరో 15 మంది సినీరంగంలోని వారి పేర్లు వెల్లడించాడు.

చదవండి: డ్రగ్స్: ఆ హీరోయిన్ ఎక్కడికి పిలిచినా వస్తుందని కెల్విన్, ఓ హీరో అరెస్ట్ ఖాయమా?

ఇందులో ఒక పెద్ద నిర్మాత పేరు కూడా ఉందని తెలుస్తోంది. వారితోపాటు పలువురు రాజకీయ నాయకులు పిల్లల గురించి కూడా బయటపెట్టినట్లుగా సమాచారం. కొందరు అమ్మాయిలు డ్రగ్స్ కోసం తమ నగ్నచిత్రాలు, వీడియోలను కెల్విన్‌కు పంపారని గుర్తించారు.

తాను ఎలా డ్రగ్స్ తెచ్చేది, ఎలా వారికి సరఫరా చేసేది, తనకు వారితో ఎలా పరిచయమయిందీ కెల్విన్‌ విచారణలో వెల్లడించాడు. ఆయన చెప్పినవి విని అధికారులు నోరెళ్ల బెట్టారని తెలుస్తోంది. ఆధారాలు సేకరించిన తర్వాతే కొత్త పేర్లు బయట పెట్టనున్నారు.

సబర్వాల్ 'యూటర్న్': లీవుల రద్దు!, ప్రభుత్వ ప్రమేయమా?..

ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డ కెల్విన్‌తోపాటు అబ్దుల్‌ వాహెద్‌, అబ్దుల్‌ ఖుద్దూస్‌లను సిట్‌ అధికారులు కోర్టు అనుమతితో శనివారం అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు వారిని విచారిస్తారు.

ఈ నెల 2నే ఈ ముఠాను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ కోరారు. ప్రాథమిక విచారణలో వెల్లడయిన అంశాల ఆధారంగా టాలీవుడ్‌లోని 12 మందికి నోటీసులిచ్చారు. ఇప్పుడు మరింత లోతుగా విచారిస్తున్నారు.

తెరపైకి డేనియల్ పేరు, ఇతని ద్వారా నగ్న వీడియోలు

తెరపైకి డేనియల్ పేరు, ఇతని ద్వారా నగ్న వీడియోలు

డ్రగ్స్ సరఫరాకు డేనియల్‌ అనే వ్యక్తిని కెల్విన్ వాడుకునేవాడని అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అనేక మంది అమ్మాయిల నగ్నచిత్రాలు, వీడియోలను డేనియల్‌ తన ఫోన్‌ ద్వారా కెల్విన్‌కు పంపాడని సమాచారం. డ్రగ్స్‌కు అలవాటుపడిన అమ్మాయిలు డబ్బు లేకపోతే ఇలా ఫొటోలు పంపేవారని కెల్విన్‌ చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. డేనియల్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.

తన గురించి కెల్విన్ షాకింగ్..

తన గురించి కెల్విన్ షాకింగ్..

విచారణలో కెల్విన్ తన గురించి అధికారులకు విస్తుపోయే విషయాలు చెప్పాడని తెలుస్తోంది. ఒక్కోసారి మత్తు ఎక్కువై తాను గంటలకొద్దీ మత్తులోనే ఉండేవాడినని, ఆ సమయంలో ఏం చేసేవాడినో తెలిసేది కాదని, ఏడవడం, నవ్వడం రకరకాలుగా ప్రవర్తించేవాడినని చెప్పాడని తెలుస్తోంది.

అలా సినిమా పరిశ్రమలో పాతుకుపోయాడు

అలా సినిమా పరిశ్రమలో పాతుకుపోయాడు

కెల్విన్‌కు రైడింగ్, గిటార్ వాయించడం తదితర అలవాట్లు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అతను సినీ ప్రముఖులను కలిసేవాడు. వారి ద్వారా క్రమంగా టాలీవుడ్‌లో పాతుకుపోయినట్లు చెప్పాడనితెలుస్తోంది. ఒక్కసారి అలవాటయితే వారే తమ వెంట పడతారని, ఒకరి ద్వారా మరొకరికి ఇలా దాదాపు 28 మందికి డ్రగ్స్ ఇచ్చేవాడనని చెప్పాడని సమాచారం.

కెల్విన్ ఎవరితో మాట్లాడాడు?

కెల్విన్ ఎవరితో మాట్లాడాడు?

సినిమా పరిశ్రమకు చెందిన 28 మందిలో ఒకరికి పబ్ ఉందని, మరొకరికి ఈవెంట్స్‌కు వెళ్తుంటారని కెల్విన్ విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది. కెల్విన్ తన ఫోన్లో నటీనటుల పేర్లతో నెంబర్లు సేవ్ చేసుకున్నప్పటికీ.. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు పర్సనల్ మేనేజర్లు తనను సంప్రదించేవారని చెప్పాడని సమాచారం. విచారణలో కెల్విన్ ఫోన్ కీలకంగా మారింది. అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు, ఎవరితో చాటింగ్ చేశాడు, వాట్సాప్ కాల్ లిస్టులో ఏముంది.. వంటి వాటిని ఆరా తీస్తున్నారు. కెల్విన్ డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

విచారణలో చెప్పినంత మాత్రాన..

విచారణలో చెప్పినంత మాత్రాన..

సమాచారం మేరకు.. కెల్విన్ తదితరులను అరెస్టు చేసిన తొలిరోజు ప్రధానంగా ఎవరెవరికి సరఫరా చేశాడన్న విషయంపై ఎక్కువ దృష్టి సారించారు. కెల్విన్‌ మరో 15 మంది పేర్లు వెల్లడించారు. చిన్న చిన్న వేషాలతో సినీ జీవితం ప్రారంభించి ఒకేసారి పెద్దపెద్ద సినిమాలు తీసిన నిర్మాత ఒకరి పేరు ఈ జాబితాలో ఉంది. మరో ముగ్గురు, నలుగురు చిన్నాచితకా నటులు కాగా ఎక్కువ మంది ఇతర విభాగాలకు చెందినవారే కొత్త జాబితాలో ఉన్నారని సమాచారం. అయితే, విచారణలో పేరు చెప్పినంత మాత్రాన కేసులో జోడించలేమని, ఆధారాలు సేకరించాల్సి ఉందంటున్నారు.

డైరెక్టర్. ఆమె శిష్యురాలు..

డైరెక్టర్. ఆమె శిష్యురాలు..

ఆధారాలు లభించగానే వారికీ నోటీసులు జారీ చేయనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ దర్శకుడు, అతని శిష్యురాలు మాత్రమే సరాసరి తనను సంప్రదించేవారని కెల్విన్‌ విచారణలో చెప్పాడని తెలుస్తోంది. మిగిలినవారు తమ డ్రైవర్లు, సహాయకుల ద్వారా సంప్రదించేవారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కెల్విన్‌ ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకునేవాడు. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం పొందుపరిచేవాడు. సినీ పరిశ్రమలోని వారు తమకు డ్రగ్స్ కావాల్సినప్పుడు ఈ గ్రూపుల్లో సంప్రదించేవారు. ఎక్కువగా పబ్బులు, బార్లలోనే కలిసి డ్రగ్స్ అందించేవారని తెలుస్తోంది.

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Names of prominent Tollywood personalities have cropped up while investigating the drug racket that was busted in Hyderabad earlier this month.
Please Wait while comments are loading...