వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"తస్మాత్ జాగ్రత్త! నల్లకుబేరులంతా.. పిచ్చోళ్లయి దాడులు చేసే ప్రమాదం!"

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నోట్ల రద్దుతో సామాన్యుల్లో పెరుగుతోన్న గందరగోళం.. మానసిక రుగ్మతలకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు సైక్రియాటిస్టులు. ముఖ్యంగా.. ఏదో విధంగా డబ్బు కూడబెట్టుకున్న చాలామంది.. ఇప్పుడు వాటికి సంబంధించి ఏం లెక్క చూపించాలో తెలియని స్థితిలో గుండెపోటుకు గురయ్యే ప్రమాదముందంటున్నారు.

అంతేకాదు, కూడబెట్టుకున్న డబ్బంతా.. కళ్లెదుటే ఎందుకు పనికిరాకుండా పోవడం జీర్ణించుకోలేని చాలామంది నల్లకుబేరులు మానసిక రుగ్మతల బారిన పడి ఎదుటోళ్ల మీద దాడులకు దిగే అవకాశముందంటున్నారు. నోట్ల రద్దు సందిగ్దం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని చాలామందిలో ఇలాంటి మానసిక ఆందోళనలు తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనేది సైక్రియాటిస్టుల అభిప్రాయం.

psychiatrist Dr Harish Shetty on Currency ban effect!

ఇప్పటికే కొత్త నోట్లు దొరకని చాలామంది.. ఏటీఎంలు, బ్యాంకుల ముందు గంటల తరబడి, రోజుల తరబడి వేచి చూస్తూ.. తీవ్ర అసహనానికి లోనవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో కొంతమంది ప్రవర్తన ఉంటుంది. మొన్నీమధ్యే ఢిల్లీలో ఓ అమ్మాయి క్యూ లో నిలుచునే.. తన టాప్ ను విప్పి పారేసిన సంగతి తెలిసిందే. కేరళలో ఏటీఎంకు అంత్యక్రియలు జరిపిస్తామంటూ ప్రకటించడం కూడా వారిలో తీవ్ర అసహనానికి ప్రతీక. మొత్తంగా నోట్ల రద్దు గందరగోళం చాలామందిని తీవ్రమైన ఒత్తిడి, అసహనానికి గురిచేస్తుందని సైక్రియాటిస్ట్
డాక్టర్ హరీశ్ షెట్టి తెలిపారు.

English summary
psychiatrist Dr Harish Shetty made some interesting statements on currency ban effect in country. He said behaviour of somany is becoming very strange
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X