నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే .. పోలీసుల వెల్లడి

ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అభం శుభం తెలియని బాలికలు ఒక ఉన్మాది ఘాతుకాలకు బలైపోయారు. ఊర్లోనే అందరి మధ్య తిరుగుతున్న ఓ మానవ మృగం లైంగిక దాడులతో పాటు బాలికలను చంపి పాడుబడిన బావిలో పాతిపెట్టి తనకేమీ తెలియనట్టు గ్రామంలో తిరగటం ఆ గ్రామస్తులకు కోపం కట్టలు తెంచుకునేలా చేసింది.

నాలుగేళ్ళక్రితం మిస్ అయిన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే

నాలుగేళ్ళక్రితం మిస్ అయిన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే

శ్రావణి హత్యకేసుతో తీగ లాగితే డొంకంతా కదలింది. నాలుగు సంవత్సరాల క్రితం బొమ్మలరామారం సమీపంలోని మైసిరెడ్డిపల్లిలో అదృశ్యమై, ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయిన కల్పన అనే అమ్మాయిని కూడా సైకో శ్రీనివాస్ రెడ్డే శ్రావణి తరహాలోనే రేప్ చేసి హత్య చేశాడని రాచకొండ పోలీసు వర్గాలు తేల్చాయి. రెండు రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు, ఇప్పటికే రెండు హత్యలు అతను చేసినట్టు తేల్చారు. నాలుగేళ్ల నాడు కనిపించకుండా పోయిన కల్పన విషయంలోనూ ఇతని ప్రమేయం ఉండవచ్చని భావించి, ఆ దిశగా విచారణ చేసిన పోలీసులు నిజాన్ని కక్కించారు.

పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం .. పోలీసుల నిర్లక్ష్యమే చిన్నారుల మృతికి కారణం

పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం .. పోలీసుల నిర్లక్ష్యమే చిన్నారుల మృతికి కారణం

ఈ విషయం గ్రామంలో తెలియగానే ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు . బీభత్సం సృష్టించారు. కల్పన అదృశ్యమైనట్టు అప్పుడే ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోలేదని, కల్పన మృతికి అప్పటి బొమ్మలరామారం ఎస్ఐ, యాదగిరిగుట్ట సీఐ కారణమంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము ముగ్గురు బిడ్డలను కోల్పోయామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కేసు రీకన్స్ట్రక్షన్ చెయ్యనున్న పోలీసులు ... శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని డిమాండ్

కేసు రీకన్స్ట్రక్షన్ చెయ్యనున్న పోలీసులు ... శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని డిమాండ్

బొమ్మలరామారంలో నమోదైన మిస్సింగ్ కేసులను తిరగదోడుతున్న పోలీసులు, నేడు నిందితుడిని బావి వద్దకు తీసుకు వచ్చి కేసు రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్టు తెలుస్తుంది. గ్రామంలో మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మీడియా పైన సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+