అల్లు అర్జున్ కేసులో మలుపు: రంగంలో దిగిన టీమ్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో- రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని స్వయంగా అసెంబ్లీలో సైతం ప్రస్తావించడం.. దీని తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమనీ ప్రకటించారాయన.

ఈ విషయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనప్పటికీ పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. అదే సమయంలో అటు ఐకాన్ స్టార్ కష్టాలకూ తెర పడట్లేదు. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకూ హాజరయ్యారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నేడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. ఆయన అరెస్టయిన సమయంలో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నేటితో ఈ రిమాండ్ ముగియబోతోంది. ఫలితంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కానున్నారు.
నాంపల్లి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీదేవి ముందు హాజరు కానున్నారు. ప్రముఖ న్యాయవాది జీ అశోక్ రెడ్డి వాదనలను వినిపించనున్నారు. ఈ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ కోసం పిటీషన్ చేయనున్నారు. దీనికి న్యాయస్థానం విధించే షరతులకు లోబడి ఉంటామని లిఖితపూరకంగా హామీ ఇచ్చే అవకాశం ఉంది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు అల్లు అర్జున్. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇది. 50,000 రూపాయల పూచీకత్తుపై నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.












Click it and Unblock the Notifications