ప్రశ్నాపత్రాలను అంగట్లో సరుకుల్లా అమ్ముతున్నారు.!ఐనా సర్కారుకు సోయి లేదన్న వైయస్ షర్మిళ.!
హైదరాబాద్ : గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినా ఏమాత్రం స్పందించని సీఎం చంద్రశేఖర్ రావు ఇప్పుడు పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల కష్టార్జితం నీటిపాలవుతున్నా సీఎం కు దున్నపోతు మీద వానపడ్డట్టుగానే ఉంటుంది గానీ స్పందనలు లేవని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ బోర్డు అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు క్వశ్చన్ పేపర్లను అమ్మకానికి పెట్టినా ఈ సర్కారుకు సోయి లేదని మండి పడ్డారు వైఎస్ షర్మిల. టీఎస్పీఎస్సీ స్కాం జరిగి నెలన్నర దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా సీఎం నిర్వహించలేదని వైయస్ షర్మిళ ఆరోపించారు.
నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా, అధికారమదంతో పోలీసులను పంపించడం, గృహ నిర్బంధానికి గురి చేస్తున్నారని సీఎం చంద్రశేఖర్ రావు పై షర్మిళ నిప్పులు చెరిగారు. స్కాంపై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి, మళ్లీ క్వశ్వన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే చంద్రశేఖర్ రావు లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోందని ఎద్దేవా చేసారు.

వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేసింది. నిరుద్యోగుల మీద సీఎం చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, ఎంతటి దోషులనైనా కఠినంగా శిక్షించాలిని షర్మిళ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications