మోడీకి దేశమే ఇల్లు, విమర్శిస్తారా: బీసీ పాయింట్ లేవనెత్తిన కృష్ణయ్య

హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటిసారిగా బిసి వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని, కాంగ్రెస్ పార్టీ ఆయనను విమర్శఇంచడమే పనిగా పెట్టుకుందని బిసి సంఘాలు గురువారం నాడు హైదరాబాదులో మండిపడ్డాయి. 14 సంఘాల బిసి సంఘాలు ప్రకటన విడుదల చేశాయి.

బిసి వర్గానికి చెందిన వ్యక్తి అనే కారణంతో ఆరోపణలు సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ బిసి వ్యతిరేక వైఖరి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోడీని విమర్శించడం, ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం వంటి పనులను మానుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోడీ సమర్థుడైన నాయకుడు అని, దేశమే ఆయన ఇల్లు, కుటుంబం అని వారు తెలిపారు. బిసి నేతపై విమర్శలు వద్దు అని బిసి సంఘం కాంగ్రెస్ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో కొత్త అస్త్రం సంధించడం గమనార్హం.

R Krishnaiah and BC unions slam Congress

కృష్ణా, గోదావరి నదీ జలాలను రాష్ట్ర అవసరాలకు సమర్థంగా వినియోగించుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను రూపొందించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నదీ జలాల వినియోగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలతో ప్రభుత్వం చర్చించాలన్నారు. తక్కువ బడ్జెట్‌తో తొందరగా సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

కృష్ణా, గోదావరి నదుల పైన ఎక్కడెక్కడా ప్రాజెక్టులు కడితే తెలంగాణకు ప్రయోజనమో అధ్యయనం చేస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు, రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్, వెదిరె శ్రీరామ్ రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+