Viral Video: మీరు వాహనాలు నడుపుతున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే..
మన రహదారిపై వెళ్తునప్పుడు బాధ్యతగా ఉండాలి. బైక్ పై వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలి. కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుడాదు. తాగి బండ్లు తోలకూడదు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇవన్నీ అందికి తెలిసినవే.. కానీ మనం వెళ్తున్నప్పుడు మన వెనక అంబులెన్సు వస్తే.. ఆ అంబులెన్సుకు దారి ఇవ్వాలి.

ప్రాణాపాయ స్థితి
ఎందుకంటే అంబులెన్సులో ప్రాణాపాయ స్థితిలో ఉండేవారు ఉంటారు. మనం అంబులెన్సుకు దారి ఇవ్వడం వల్ల వారి ప్రాణాలను కాపాడినవారవుతాం. అయితే కొందరు వెనకాల అంబులెన్సు ఉన్నా సైడ్ ఇవ్వకుండా వాహనాలు నడుపుతారు. ఇది సరైన పద్ధతి కాదని పోలీసులు చెబుతున్నారు.

రద్దీగా
రద్దీ ఎక్కువగా ఉన్నా ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్సు పంపొచ్చని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రాచకొండ పోలీసులు తమ అధికారికా ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఓ రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంది. ఈ వాహనాల వెనక
అంబులెన్సు ఉంది.

క్రమ పద్ధతి
అంబులెన్సులో ఓ వ్యక్తి గాయపడి ఉన్నాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అంబులెన్సు ముందు చాలా కార్లు ఉన్నాయి. దీంతో అంబులెన్సులో ఉన్నవారు భయపడ్డారు. కానీ ముందున్న వాహనాదారులు వెంటనే స్పందించి తమ కార్లను క్రమ పద్ధతిలో పక్కకు ఆపారు. దీంతో అంబులెన్సు సాఫీగా వెళ్లిపోయింది.
9 వేలకు పైగా వ్యూస్
రాచకొండ పోలీసులు వీడియో పోస్ట్ చేస్తూ రద్దీగా ఉండే రోడ్డుపై అంబులెన్స్ కోసం మార్గాన్ని ఎలా క్లియర్ చేయాలి. మనం చాలా నేర్చుకోవచ్చు. దీన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. అని రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 9 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.












Click it and Unblock the Notifications