చిలుకానగర్ నరబలి: నగ్నంగా రాజశేఖర్ దంపతుల క్షుద్రపూజలు, బోయిగూడ నుండి చిన్నారి కిడ్నాప్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.రాజశేఖర్ దంపతులు క్షుద్రపూజలో నగ్నంగా పాల్గొన్నారని పోలీసుల విచారణలో తేలింది. చిన్నారిని బోయిగూడ నుండి ఎత్తుకొచ్చి నరబలి ఇచ్చారని పోలీసులు తమ విచారణలో తేల్చారు.

  చిన్నారిది నరబలే! అతనే నిందితుడు.. అదే పట్టించింది..!

  చిన్నారి నరబలి కేసులో రాజశేఖర్‌ ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు రాజశేఖర్ సహ మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఈ కేసులో రాజశేఖర్ ఇంటి పక్కనే నివాసం ఉండే నరహరి అతని కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. కానీ, ఈ కేసులో అసలు నిందితుడు రాజశేఖర్ అని పోలీసులు పక్కా ఆధారాలను సేకరించారు.

  అయితే ఈ కేసులో పోలీసులను రాజశేఖర్ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసినట్టుగా గుర్తించారు. అయితే ఖచ్చితమైన ఆధారాలను సేకరించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

  నగ్నంగా రాజశేఖర్ దంపతుల పూజలు

  నగ్నంగా రాజశేఖర్ దంపతుల పూజలు

  ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. చంద్రగ్రహణం రోజున నరబలి చేస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతోందని మంత్రగాడు ఇచ్చిన సలహతో రాజశేఖర్ చిన్నారిని బలి ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మంత్రగాడి సలహతో రాజశేఖర్ దంపతులు నగ్నంగా క్షద్రపూజలో పాల్గొన్నారు. ఈ పూజలు చేయడం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమ్యలు తీరుతాయని మంత్రగాడు చెప్పాడు. దీంతో రాజశేఖర్ దంపతులు ఈ మేరకు నగ్నంగానే పూజలో పాల్గొన్నారు.

  చిన్నారిని బోయిగూడ చమన్ వద్ద కిడ్నాప్

  చిన్నారిని బోయిగూడ చమన్ వద్ద కిడ్నాప్

  బోయిగూడ చమన్ వద్ద చిన్నారి కిడ్నాప్ చేసి రాజశేఖర్ తీసుకొచ్చాడు. నరబలి ఇచ్చేందుకే ఆ చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే క్షుద్రపూజలో భాగంగా చిన్నారని బలి ఇచ్చి మేడపై చిన్నారి తల వేశారు. మూసిలో చిన్నారి మొండాన్ని పారేశారు. ఈ విషయాన్ని విచారణలో రాజశేఖర్ ఒప్పుకొన్నారని పోలీసులు చెబుతున్నారు.

  నరబలిలో ముగ్గురు మహిళలు

  నరబలిలో ముగ్గురు మహిళలు

  నరబలిలో ముగ్గురు మహిళలు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఐదేళ్ళ చిన్నారిని నరబలి ఇచ్చారని పోలీసులు గుర్తించారు. ఆర్థిక, ఆనారోగ్య సమస్యలను తీరేందుకు నరబలి ఇచ్చారని నిందితులు ఒప్పుకొన్నారు.

  మూసీలో పారేసిన చిన్నారి మొండెం

  మూసీలో పారేసిన చిన్నారి మొండెం

  నరబలి ఇచ్చిన తర్వాత మూసీలో చిన్నారి మొండెం పారేశారు. ఈ మేరకు పోలీసులు మూసీలో చిన్నారి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. క్షుద్రపూజలను పూర్తి చేసిన తర్వాత మూసీలో జాగ్రత్తగా చిన్నారి మొండెన్ని పారేశారు.మొత్తంగా ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు.

  ఈ కేసును నా మీదకు నెట్టే ప్రయత్నం

  ఈ కేసును నా మీదకు నెట్టే ప్రయత్నం

  నరబలి కేసును తన మీదకు నెట్టేందుకు రాజశేఖర్ ప్రయత్నించారని రాజశేఖర్ ఇంటి పక్కనే నివాసం ఉండే నరహరి చెప్పారు. పోలీసుల విచారణ సందర్భంగా డాగ్ స్వ్యాడ్ మా ఇంట్లోకి రావడంతో పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. సంఘటన జరిగిన రోజున ఏం జరిగిందనే విషయమై పోలీసులు విచారణ చేసి వదిలేశారని నరహరి చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rachakonda police arrested 8 persons in Chilkanagar child sacrifice case on Thursday.Five years old child sacrifice on last month.police were arrested including Rajashekar and other 7 persons.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి