Rains: వర్షాల వేళ విద్యుత్‍తో జాగ్రత్త.. పలు సూచనలు చేసిన రఘుమా రెడ్డి..
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జీ రఘుమా రెడ్డి సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు. వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడకూడదని చెప్పారు.
వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉంచాలి. ఎక్కడైనా రోడ్ మీద, నీటిలో కాని విద్యుత్ తీగ పడి ఉంటే ఆ తీగను తొక్కడం గాని, వాటి మీద నుంచి వాహనాలు నడపడం చేయకూడదన్నారు. ఒక వేళ ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి గాని, కింద ఇవ్వబడ్డ నెంబర్ల ద్వారా సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వెంటనే సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు.

భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలిజేయాలని కోరారు.
విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్ కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లు పై ముద్రితమైన USC నెంబర్ ను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.లోతట్టు ప్రాంతాల్లో, అపార్ట్మెంట్ సెల్లార్ లలో నీళ్లు చేరితే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చిన 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయలన్నారు. దీనికి తోడు సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications