ప్రియురాలి గురించి అసభ్యంగా మాట్లాడాడు,దారుణానికి పాల్పడ్డాడు
ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రాణాలను తీసేవరకు వెళ్ళింది. స్నేహితుడి ప్రేయసి గురించి మిత్రుడు అసభ్యంగా మాట్లాడాడనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడిని డంబుల్ తో కొట్టిచంపాడు నిందితుడు. ఈ ఘటన హైద్
హైదరాబాద్ :ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రాణాలను తీసేవరకు వెళ్ళింది. స్నేహితుడి ప్రేయసి గురించి మిత్రుడు అసభ్యంగా మాట్లాడాడనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడిని డంబుల్ తో కొట్టిచంపాడు నిందితుడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని న్యూ మారుతీ నగర్ లో నివాసం ఉంటున్న రహీంకు ఇసామియా బజార్ కు చెందిన నవీన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు.
ఈ నెల 16వ, తేదిన రహీమ్ రూమ్ కు నవీన్ వచ్చాడు. వీరిద్దరూ కలిసి మద్యం తాగారు.ఈ సందర్భంగా రహీం ప్రేయసి గురించి నవీన్ అసభ్యంగా మాట్లాడాడు.
దీంతో ఇద్దరి మద్య ఘర్షణ చోటుచేసుకొంది.మద్యం మత్తులో ఉన్న నవీన్ నిద్రిస్తున్న రహీంను బండరాయితో కొట్టాడు. అంతేకాదు డంబుల్ తో బలంగా తలపై మోదాడు.

ఈ దెబ్బలకు రహీం అక్కడికక్కడే మరణించాడు. రహీం జేబులో ఉన్న 1500 రూపాయాలను, ఆయన రెండు సెల్ ఫోన్లను నవీన్ తీసుకొని వెళ్లాడు.
రహీం చనిపోయిన విషయం బయటకు రాకుండా ఉండేందుకుగాను మృతదేహంపై ఉప్పుచల్లాడు. అయితే రెండు రోజుల తర్వాత రహీం స్నేహితులు ఆయన గదికి వచ్చారు. తాళం వేసి ఉన్న రూమ్ నుండి దుర్వాసన వస్తోంది.
రహీం స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు తాళం పగులగొట్టి చూస్తే రహీం మరణించి ఉన్నాడు.పోలీసులు విచారణ చేసి నిందితుడు నవీన్ ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications