Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గద్దర్ ప్రేమే పోరాటం: బాధగా ఉందంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేశారు. గద్దర్ మృతి చాలా బాధాకరమని అన్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు. ఈ మేరకు ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.

గద్దర్ మృతి వార్త విని బాధలో మునిగిపోయినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజలపై గద్దర్‌కు ఉన్న ప్రేమే ఆయన్ను పోరాటం వైపు నడిపిందని రాహుల్ వ్యాఖ్యానించారు. గద్దర్ మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Rahul Gandhi and priyanka gandhi condoles for Gaddars death

'దిగ్గజ కవి, ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్ రావు మరణవార్త విని బాధగా ఉంది. సామాజిక సమస్యల పట్ల ఆయన చూపిన అచంచలమైన అంకితభావం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం. గద్దర్ జీ శక్తివంతమైన పద్యాలు లక్షలాది మంది ఆకాంక్షలను ప్రతిధ్వనించాయి, మన హృదయాలపై చెరగని ముద్ర వేసాయి. ఆయన వారసత్వం మార్పు జ్వాలలను రగిలిస్తూనే ఉండనివ్వండి. ప్రశాంతంగా ఉండండి, గద్దర్ జీ..' ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

గద్దర్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ మృతికి భట్టి నివాళి అర్పించారు. సమాజ మార్పు కోసం తన ఆట, పాటతో పనిచేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ పాట ఉర్రూతలూగించిందని అన్నారు.

మరోవైపు, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థీవ దేహం సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటుందని తెలిపారు. గద్దర్ అభిమానులు, ప్రజలు.. గద్దర్ పార్థీవ దేహాన్ని చూడలనుకుంటున్నవారు ఎల్బీ స్టేడియానికి రావచ్చునని సీతక్క చెప్పారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

గద్దర్ మృతి పట్ల భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో మంచి అనుబంధం ఏర్పడిందని.. తన పోరాటానికి ఆయన స్ఫూర్తి అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరమని, తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారన్నారు. తెలంగాణ ఉద్యమ గళం అయిన గద్దర్ స్మృతిలో.. ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+