Congress: కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక..
తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభం అయింది. రామప్ప ఆలయం నుంచి విజయభేరి యాత్రను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి ప్రారంభించారు. రామప్ప ఆలయం నుంచి ములుగు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ఇతర నేతలు పాల్గొన్నారు.
అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, టి. సుబ్బిరామిరెడ్డి, రేణుక చౌదరీ, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, నిరంజన్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్, సమీరుల్లా, ఫేహెం ఖురేషి, ఫేహీం, మెట్టు సాయి కుమార్ ఘన స్వాగతం పలికారు.

ఆ తర్వాత రాహుల్, ప్రియాంక హెలికాప్టర్ లో ములుగు జిల్లాలోని రామప్పకు చేరుకున్నారు. అంతకుముందు రాహుల్ , ప్రియాంక రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు రాహుల్ , ప్రియాంక రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. వారు కాసేపట్లో ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. రాజకీయ లాభ, నష్టాలను పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామన్న ఆయన.. ఏ పార్టీ కూడా తనకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకోదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చినట్లు తెలిపారు. దళితులకు 3 ఏకరాల పేరుతో బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ మీ భూములు లాక్కుండని, కాళేశ్వరం పేరుతో మీ జేబులోంచి లక్షల కోట్లు లాక్కున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ ఆరోపించారు.












Click it and Unblock the Notifications