వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ మహిళలు లేకుంటే: కేసీఆర్-మోడీపై రాహుల్ నిప్పులు, జీఎస్టీపై శుభవార్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ, కేసీఆర్‌లు బడా పారిశ్రామికవేత్తలకు లోన్లు ఇస్తున్నారు తప్ప సాధారణ పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం లేదన్నారు.

Recommended Video

కాంగ్రెస్ బూత్‌ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్‌కు రాహుల్: కాంగ్రెస్‌కు చుక్కలు! విమానాశ్రయంలోకి జైపాల్ రెడ్డికి నోహైదరాబాద్‌కు రాహుల్: కాంగ్రెస్‌కు చుక్కలు! విమానాశ్రయంలోకి జైపాల్ రెడ్డికి నో

మోడీ తీసుకు వచ్చిన జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదు రకాల ట్యాక్స్‌లు ఉండవని చెప్పారు. ఒకే ట్యాక్స్ ఉంటుందని శుభవార్త తెలిపారు. పలు రకాల ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. మోడీ ప్రభుత్వం మీ నుంచి డబ్బు తీసుకొని బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోందన్నారు. రాజేంద్రనగర్ క్లాసిక్ కన్వెన్షన్ హాలులో మహిళా సంఘాలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

మోడీ హయాంలో పారిశ్రామికవేత్తలకే రుణాలు మాఫీ అవుతాయి

గత రెండేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు 2.5 లక్షల కోట్ల రుణం మాఫీ చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ ప్రభుత్వం సామాన్యులకు చేసింది ఏమీ లేదన్నారు. మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేస్తున్నారన్నారు. రైతులు, మహిళా సంఘాలకు మాత్రం రుణమాఫీ కాలేదన్నారు. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.

మోడీ, కేసీఆర్ వారికే ఇస్తున్నారు

తెలంగాణ ప్రభుత్వం, ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే లోన్లు ఇస్తోందని, చిన్న వారికి ఇవ్వడం లేదని రాహుల్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు మహిళలకు, చిన్న పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు పోతేనే అభివృద్ధి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.

నోట్ల మార్పిడి సమయంలో ధనవంతుల అక్రమ నోట్ల మార్పిడి

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు 30వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిందని రాహుల్ తెలిపారు. నోట్ల రద్దు తర్వాత నిరుపేదలే బ్యాంకుల ముందు క్యూ కట్టారన్నారు. ధనవంతులు మాత్రం అక్రమంగా నోట్లను మార్పిడి చేసుకున్నారన్నారు. మోడీ ప్రభుత్వం సామాన్యులకు చేసిందేమీ లేదన్నారు. నల్ల డబ్బును తీసుకు వస్తానని చెప్పిన మోడీ మన డబ్బు తీసుకున్నారన్నారు.

నేను తెలంగాణ మహిళా సంఘాలను నమ్ముతున్నా

తెలంగాణ మహిళా సంఘాలను నేను పూర్తిగా నమ్ముతున్నానని, దానికి కారణం ఉందని రాహుల్ అన్నారు. నాకు మహిళా సంఘాలతో పని చేసిన అనుభవం ఉందని చెప్పారు. తాను, తన తల్లి సోనియా గాంధీలు ఎంపీలుగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించానని, కానీ యూపీలో మహిళా సంఘాలు వీలుకాదని పెద్దపెద్ద వారు చెప్పారన్నారు. కానీ ఇప్పుడు యూపీలో 17 లక్షల మంది మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. దీనికి తెలంగాణ మహిళా సంఘాలే కారణమన్నారు. తెలంగాణ మహిళా సంఘాలు లేకుంటే ఇది సాధ్యం కాకపోయేదన్నారు.

తెలంగాణ మహిళా సంఘాలు లేకుంటే సాధ్యం కాకపోయేది

యూపీలో మహిళా సంఘాలు సాధ్యం కాదని తనకు చెప్పినప్పుడు, ఏపీలో, తెలంగాణలోని మహిళా సంఘ నాయకురాళ్లను తాను యూపీకి తీసుకు వెళ్లానని, వారు యూపీకి వచ్చి మహిళా సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలని, నిర్వహణ ఎలా అనే అంశాలపై వివరించారని చెప్పారు. దీంతో యూపీలో మహిళా సంఘాలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ మహిళా సంఘ సభ్యులు లేకుంటే యూపీలో మహిళా సంఘాలు ఏర్పాటు సాధ్యం కాకపోయేవన్నారు.

మహిళా సంఘాలకు ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు అన్నీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

ఫైనల్‌గాఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

ఫైనల్‌గాఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

మన సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ వచ్చారని, అందుకు ధన్యవాదాలు అన్నారు. కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరన్నారు. శాసన మండలిలో ఒక్క మహిళా సభ్యురాలు లేరని చెప్పారు. మహిళా సంఘాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి ద్వారా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళా సంఘాల వడ్డీ రుణం ప్రభుత్వమే భరిస్తుందని, ప్రమాద బీమాను రూ.5 లక్షలు చేస్తామన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్ అన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ అన్యాయానికి గురువుతోందన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 కంటే ఎక్కువ పించన్ ఇస్తుందన్నారు.

English summary
AICC president Rahul Gandhi interaction with women in Hyderabad, takes on Modi and KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X