వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలో ఉంటారా, వెళ్లిపోతారా: జానా రెడ్డిని ప్రశ్నించిన రాహుల్ గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్టీలో ఉంటారో వెళ్లిపోతారో చెప్పాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ నేత జానారెడ్డిని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ ఊహాగానాలు వస్తున్నాయని గుర్తు చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఆయన జానాతో సూచించినట్టు తెలిసింది.
బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి మాట్లాడిన రాహుల్ సీనియర్లు పార్టీనుంచి వెళ్లిపోతుంటే దాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదని పార్టీ నేతలను అడిగినట్లు చెబుతున్నారు.

పార్టీలో ఉంటారా, వెళ్లిపోతారా అని రాహుల్ గాంధీ నేరుగా అడగడంతో జానా రెడ్డి కాస్తా కంగారు పడినట్లు సమాచారం. అలాంటిదేమి లేదని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, ఎవరెన్ని చెప్పినా, ఏ రకంగా ప్రచారం జరిగినా తాను కాంగ్రెసు పార్టీని వదిలేది లేదని జానా రెడ్డి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.ఈ విషయంలో ఎలాంటి అపోహలు, అనమానాలు వద్దని రాహుల్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది.

Rahul Gandhi questions Jana Reddy on rumors

డీఎస్ లాంటి విశ్వాసపాత్రులైన నేతలే వెళ్లిపోతుంటే ఇంకా ఎవర్ని విశ్వసించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్, షబ్బీర్ అలీలు జోక్యం చేసుకుంటూ డీఎస్ వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నమష్టమేమి లేదని, ఆయన నిష్క్రమణతో పార్టీలో నేతలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారని తెలిసింది.

అయితే రాహుల్ పార్టీ ఫిరాయింపులను మీరు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు? అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇకపై సీనియర్ నేతలు ఎవదూ పార్టీని వదిలి వెళ్ళకుండా చూడాలని రాష్ట్ర నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

వెంటనే ఢిల్లీకి రావాలన్న అధిష్టానం ఆదేశం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కే జానారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ జరిపి తర్వాత అక్కడి నుంచి రాహుల్ గాంధీ వద్దకు వెళ్ళారు.

అసలు పార్టీ బలోపేతానికి మీ దగ్గర కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ఉందా? అని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అడిగినట్లు చెబుతున్నారు. రానున్న ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించిట్టు తెలిసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం తదితర అంశాలపై రాహుల్ వారితో చర్చించారు.

English summary
It is said that AICC vice president Rahul Gandhi has questioned CLP leader K Jana Reddy on the rumors on the later's jumping from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X