నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజమే చెప్పారు.. మీరు రెస్ట్ తీసుకుంటేనే, కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018: కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది - రాహుల్ గాంధీ!!

నిజామాబాద్: ఇటీవల తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ నిజం చెప్పారని, తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని చెప్పారని, అది వాస్తవం కాబోతుందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఆర్మూర్, పరిగి బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ముఖ్యమంత్రిగా చేస్తే, ఆయన మాత్రం అధికారంలోకి రాగానే హామీలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేర్లు మార్చేందుకు రూ.40వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని చెప్పారు.

దక్షిణాది కంటే ఉత్తరాది క్లీన్ స్వీప్ : ఈ 49 సీట్లలో తెరాస గెలవలేదు, ఈసారి సత్తా చూపేనా?దక్షిణాది కంటే ఉత్తరాది క్లీన్ స్వీప్ : ఈ 49 సీట్లలో తెరాస గెలవలేదు, ఈసారి సత్తా చూపేనా?

 కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు

కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు

మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పారు. కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు అని విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.1.50 లక్షలు అప్పు మోపారని ఆరోపించారు. తెలంగాణలో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. తెరాస నేతలు దేవాలయాల భూములను సైతం కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. 17 రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు.

కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన టైం వచ్చింది

కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన టైం వచ్చింది

కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే తెలంగాణ సమాజం బాగుపడుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని చెప్పారు. గ్రామ పంచాయతలకు నిధులు ఇచ్చి బాగు చేసుకుంటామని చెప్పారు. మన అప్పులు పెరుగుతుంటే కేసీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయని చెప్పారు.

టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆరెస్సెస్

టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆరెస్సెస్

తాము అధికారంలోకి వస్తే ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే యువతకు తాము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పేరు తెలంగాణ ఆరెస్సెస్ అని సెటైర్ వేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంలో బీజేపీని ఓడిస్తామని చెప్పారు. తెరాస, మజ్లిస్ పార్టీలు బీజేపీకి బీ, సీ టీంలు అని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

ప్రాజెక్టు రీడిజైనింగ్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర సంపదను తన కుటుంబానికి వెచ్చిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రూ.2.50లక్షల కోట్ల మేర అప్పులు చేశారని, ఒక్కో పౌరుడి పేరిట రూ.2.50లక్షల అప్పు ఉందని చెప్పారు. పంటలకు నీరు అడిగితే పోలీసులతో లాఠీఛార్జి చేయించారన్నారు. కేసీఆర్‌, ఆయన కూతురు కవిత కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ, అలా చేయలేకపోయారన్నారు.

కేసీఆర్ రూ.300 కోట్ల భవంతిలో విశ్రాంతి

కేసీఆర్ రూ.300 కోట్ల భవంతిలో విశ్రాంతి

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌ జీఎస్టీని సమీక్షిస్తామని, బీడీ కార్మికులు, యాజమాన్యాలపై జీఎస్టీ భారం లేకుండా చూస్తామన్నారు. ఓడిపోయాక కేసీఆర్‌ విశ్రాంతి తీసుకునేది రూ.300కోట్ల భవంతిలో అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గల్ఫ్‌ బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం. రూ.500కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం.'' అని ప్రజలకు హామీ ఇచ్చారు.

English summary
AICC chief Rahul Gandhi said that Telangana CM KCR will take rest after assembly elections. It was Rahul Gandhi’s turn to rip into Chief Minister K Chandrashekhar Rao, by labelling the latter's Telangana Rashtriya Samiti the BJP’s B team, while campaigning in the Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X