రాహుల్ పర్యటన షెడ్యూల్ ఇలా : రైతులు - అమరవీరుల కుటుంబాల పరామర్శ : కార్యకర్తలతో..!!
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాహుల్ గాంధీ పాల్గొనే కార్యక్రమాలు..సమావేశాలు..పరామర్శలకు సంబంధించి చేస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫైనల్ చేసారు. ఈ షెడ్యూల్ కు తుది ఆమోదం కోసం రాహుల్ గాంధీ కార్యాలయానికి పంపారు. మే 6వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Recommended Video

అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5:30 గంటల నుంచి 6:30 వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వేదిక పైన టీపీసీసీ చీఫ్ రేవంత్..సీఎల్పీ నేత భట్టిో పాటుగా మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ తరువాత రాహుల్ గాంధీ సాయంత్రం 7 గంటల నంచి దాదాపు గా నిమిషాల సేపు ప్రసంగింస్తారు. ఇక, సభ పూర్తయిన తరువాత వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. నగరంలోని కోహినూర్ హోటల్ లో ఆయన రాత్రి బస చేయనున్నారు.

ఇక, 8వ తేదీ రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనేక కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. అల్పాహారం..మధ్నాహ్నం భోజనం సమయంలోనూ రెండు వీఐపీ బృందాలతో కలిసేలా షెడ్యూల్ ఖరారు చేసారు. అదే రోజున తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమ కారులు..అదే విధంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ భేటీ కానున్నారు. బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన భూమిని కూడా రాహుల్ సందర్శించనున్నారు.
అక్కడ రాజీవ్ నాలెడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేసిన పార్టీ కార్యకర్తలను రాహుల్ కలవనున్నారు. వారితో ఫొటో సెషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమం నిర్ణయించినా..తాజాగా వర్సిటీ పాలక మండలి అనుమతి నిరాకరించింది. దీంతో..కోర్టు ద్వారా ప్రయత్నాలు చేస్తూనే..అప్పటికి అనుమతి రాకపోతే..విద్యార్ధులతోనూ ముఖాముఖి ఏర్పాటు పైన కసరత్తు చేస్తున్నారు. 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ కార్యక్రమాల ఖరారు కు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి అనుమతి రాగానే.. పార్టీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.












Click it and Unblock the Notifications