రెండ్రోజులపాటు రాహుల్ హైదరాబాద్ పర్యటన: 5వేల బైక్‌లతో స్వాగతం, షెడ్యూల్ ఇలా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఆగస్టు13, 14తేదీల్లో రాహుల్ నగరంలో పర్యటించనున్నారు. ఆగస్టు 13న మధ్యాహ్నం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు 5000 బైక్‍లతో కార్యకర్తలు ర్యాలీగా స్వాగతం పలుకుతారు.
అనంతరం రాజేంద్రనగర్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్వయం సహాయక గ్రూపు సభ్యులతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 5గం. నుంచి 6.30గం. వరకు శేరిలింగంపల్లిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 8 నుంచి 9.30గంటల వరకు నాంపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 10-11గంటల వరకు ముస్లిం మేధావులతో సమావేశంలో పాల్గొంటారు.

ఆగస్టు 14న ఉదయం 9.30గంటలకు రాహుల్ గాంధీ పెద్దమ్మగుడిని దర్శించుకుంటారు. ఉ.10 నుంచి 11 గంటల మధ్య జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నాయకులతో సమావేశం ఉంటుంది. 11 నుంచి 12 గంటల మధ్య వ్యాపారవేత్తలతో సమావేశం, ఆ తర్వాత 12 నుంచి 12.30 గంటల మధ్య ప్రెస్‌క్లబ్‌లో ఎడిటర్లతో సమావేశం, మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు ప్యారడైజ్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తారు.
మ. 2 నుంచి 3 గంటల మధ్య ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తారు. మ. 3.30 నుంచి 4.30 గంటల మధ్య సికింద్రాబాద్‌లో పబ్లిక్ మీటింగ్‌లోని పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సనత్‌నగర్‌లో సమావేశం, ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్యలో గోషామహల్‌లో సమావేశంలో పాల్గొంటారు.
14న రాత్రి. 8 నుంచి 9 గంటల మధ్యలో కులీకుతుబ్ షా స్టేడియంలో మీటింగ్, రా9-9.30 వరకు పాతబస్తీలోని మదీనా హోటల్లో రాత్రి భోజనం, ఆ తర్వాత రాత్రి 10.30 గంటలకు తిరిగి ఢిల్లీ పయనమవుతారు. కాగా, రాహుల్ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications