నన్ను చంపేయండి.. కేసీఆర్, కేటీఆర్ రావాలి - రాహుల్ రామకృష్ణ
ప్రముఖ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ.. గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈయన తరచూ తన పోస్ట్‌ల ద్వారా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని ట్వీట్‌లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు ఆ పోస్టుల్లో..
మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను" అని కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ రామకృష్ణ ట్వీట్ చేశారు. అలాగే, కేసీఆర్‌ను ట్యాగ్ చేస్తూ "నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి" అని పోస్ట్ చేశారు. మరో ట్వీట్‌లో "హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు" అని కేసీఆర్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పోస్ట్‌లకు ఏకంగా బీఆర్‌ఎస్ నాయకులను ట్యాగ్ చేస్తూ ఉండటంతో, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై స్పందించకపోయినప్పటికీ.. వివాదాస్పదంగా మాత్రం మారాయి.
అంతేకాకుండా, గతంలో ఓ రైలు ప్రమాదంపై, పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన వెనక్కి తీసుకున్నారు. గాంధీ జయంతి రోజున "గాంధీజీ గొప్పవాడని నేను అనుకోవట్లేదు" అని వివాదాస్పద పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications