తెలంగాణకు కేంద్రం ఊహించని వరం, గేమ్ ఛేంజర్..!!
తెలంగాణకు కేంద్రం భారీ ప్రాజెక్టుకు దాదాపు ఆమోద ముద్ర వేసింది. కొంత కాలంగా కేంద్రంతో వరుస చర్చల్లో భాగంగా పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఆమోద ముద్ర కోసం కీలక భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణలో గేమ్ ఛేంజర్ గా కనిపిస్తున్న ప్రాజెక్టు పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణతో పాటుగా ఏపీకి కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరో అనుకూల పరిణామం చోటు చేసుకుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటుగా దీనిని ఏపీ రాజధాని అమరావతితో అనుసం ధానించే హైస్పీడ్ రైలు వ్యవహారం కొలిక్కి వచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్ - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ( కొత్త అలైన్ మెంట్) నిర్మాణానికి హామీ ఉంది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేను, ఇదే ప్రాంతంలో నిర్మించాలని భావిస్తున్న డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేకు పక్కనే కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ రైలు మార్గాన్ని హైస్పీడ్ కారిడార్ గా నిర్మించాలని.. అది రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా ఉపయుక్తమని భావిస్తోంది. సీఎం రేవంత్ ఇటీవల ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమైన సమయంలో ఈ అంశాలకు కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించే రోడ్డు ఏఏ ప్రాంతాల మీదగా చేపట్టాలనే అంశాన్ని పరిశీలించే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించింది. దీంతో.. ఈ ప్రాజెక్టు పైన కేంద్రం సానుకూల స్పందన.. వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications