తుఫాను ఎఫెక్ట్ - 29 వరకు రైళ్లు రద్దు, లిస్టులో..!!

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రకటన చేసింది. తుఫాను కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు 200 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య రైల్వే కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసారు. రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

29 వరకు రద్దు
ఒడిశా తీరప్రాంతంలో దానా తుఫాన్‌ కారణంగా రైల్వే శాఖ పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా.. తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రధాన రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసారు.

Railways cancelled several express and passenger trains due to Dana Cyclone

నేడు రద్దయిన రైళ్లు
ఈనెల 24న ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌-హావ్‌డా(22888) హమ్‌సఫర్, భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి(11020) కోణార్క్, భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌(12830), హైదరాబాద్‌-షాలిమార్‌(18046) ఈస్ట్‌కోస్టు.., 25న చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ (12829), భువనేశ్వర్‌-విశాఖ (20841) వందేభారత్, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (17015) విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌- కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌(17015) ప్రశాంతి, భువనేశ్వర్‌-రామేశ్వరం(20896), పూరీ-యశ్వంత్‌పూర్‌(22883) గరీబ్‌రథ్‌ను రద్దు చేశారు.

రద్దయిన లిస్టులో
26న పూరీ-గాంధీధామ్‌ (22974), సికింద్రాబాద్‌-సిల్చార్‌ (12513), యశ్వంత్‌పూర్‌-పూరీ (22884) గరీబ్‌రథ్, మంగళూర్‌ సెంట్రల్‌- సంత్రాగచ్చి (22852), ఎస్‌ఎంవీ బెంగళూర్‌-కామాఖ్య(12551), 27న రామేశ్వరం-భువనేశ్వర్‌ (20895), వాస్కోడిగామ-షాలిమార్‌ (18048) అమరావతి, 29న మాల్దా టౌన్‌-సికింద్రాబాద్‌ (03430) రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల సమాచారం ప్రయాణికులకు చేరవేయడానికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Railways cancelled several express and passenger trains due to Dana Cyclone

హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, ఖమ్మం, సామర్లకోట, వరంగల్‌, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, గూడూరు, నిడదవోలు, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, డోన్‌ స్టేషన్లలోని హెల్ప్‌లైన్‌ సెంటర్లు 24 గంటలపాటు ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక, పశ్చిమ బెంగాల్, ఒడిశా పైన తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల నిర్వహణ పైన అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+