సంక్రాంతికి ఊరెళ్లే రైల్వే ప్రయాణీకులకు కీలక అప్డేట్ - రిజర్వేషన్లు ఇలా..!!
సంక్రాంతి ప్రయాణాల పై రైల్వే శాఖ కీలక అప్డేట్. ప్రతీ ఏటా సంక్రాంతి సమయంలో రైళ్లన్నీ రద్దీగా ఉంటాయి. పాఠశాలలకు సెలవులు కావటంతో పాటుగా పెద్ద పండుగ కావటంతో సొంత వారి తో కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఇందు కోసం హైదరాబాద్ నగరం దాదాపుగా ఖాళీ అవుతుంది. ఇదే సమయంలో రైళ్లన్నీ ముందస్తు రిజర్వేషన్ తో ఫుల్ అవుతాయి. రద్దీ.. డిమాండ్ ను పరిగణలో కి తీసుకొని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ముందస్తుగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతి ప్రయాణాల కోసం ప్రయాణీకులకు కీలక సమాచారం అందిస్తోంది.
సంక్రాంతికి ప్రయాణాలు చేసే వారికి రైల్వే శాఖ కీలక సూచన చేస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైలు టికెట్ల రిజర్వేషన్లపై ప్రయాణికులకు రిజర్వేషన్ ప్రారంభం అవుతోంది. రైల్వే నిబంధనల ప్రకారం ప్రస్తుతం 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. జనవరి 14న భోగి పండుగ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి టికెట్ల బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో సంక్రాంతి ప్రయాణాలకు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణ తేదీలను ముందుగానే నిర్ణయించుకుని టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకోవటం ద్వారా చివరి నిమిషం సమస్యలు ఉండవని సూచన చేస్తున్నారు.

రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు
మరోవైపు సంక్రాంతికి ఒకటి, రెండు రోజుల ముందుగానే సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణ తేదీలకు అనుగుణంగా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. పండుగ సమీపించే కొద్దీ ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పెరిగే అవకాశం ఉండటంతో చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణ రైళ్లలో టికెట్లకు డిమాండ్ పెరిగే నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించనుంది. రైళ్లల్లో ఉన్న వెయింటింగ్ లిస్టుకు అనుగుణంగా ఆ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్నారు. ప్రయాణికుల రద్దీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే డిమాండ్ ఆధారంగా ప్రత్యేక సర్వీసులను నడిపే అంశంపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేక రైళ్ల ప్రకటన వెలువడితే సంక్రాంతి ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలగనుంది. దీంతో, రిజర్వేషన్ల తేదీలు ప్రారంభం అవుతున్న వేళ ప్రయాణీకులు అలర్ట్ కావాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
