ALERT: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఉపరితర ఆవర్తణ ద్రోణి కారణంగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నిజామాబాద్‌లో సాధారణం కన్నా 2.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 1.1 డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీలు కాగా.. ఖమ్మంలో 2.7 డిగ్రీలు పెరిగి 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వివరించింది.
అల్పపీడనం ఏర్పడే అవకాశం..
ఉపరితర ఆవర్తన ద్రోణి కొనసాగుతున్న కారణంగా దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణశాఖ తెలిపింది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితర ఆవర్తన ద్రోణి ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని 148 వర్షపాత నమోదు కేంద్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముఖ్యంగా ఉప్పల్, మలక్ పేట్, ఖైరతాబాద్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో వర్షం అధికంగా కురిసింది.












Click it and Unblock the Notifications