• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వానొస్తే.. రోడ్లన్ని చెరువులే! చెరువులు-గుంతల నగరంగా హైదరాబాద్! (ఫోటోలు)

|

హైదరాబాద్ : చినుకు పడితే చాలు నాలాలు పొంగిపొర్లుతాయి. రోడ్లన్ని కంకర తేలుతాయి. ఎక్కడ చూసినా గుంతలు.. బురద.. నగరమంతా ట్రాఫిక్ జామ్. ఇదీ వానొస్తే హైదరాబాద్ పరిస్థితి. కాలనీలన్నీ జలమయం.. వాహనాలు పాడైపోవడం.. వర్షం కురిసిన ప్రతీసారి వాహనాదారుల జేబుకు పెద్ద చిల్లే పడుతోంది. ఇక వాన కాస్తంత తెరిపి ఇచ్చిందంటే చాలు.. రోడ్లన్ని దుమ్ము ధూళి పేరుకుపోయి రోడ్డున పోయే వాళ్లందరు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి.

Rain in city damages many roads

హై అలర్ట్ ప్రకటించిన అధికారులు:

మంగళవారం రాత్రి నుంచి ఎడతెరి లేకుండా కురుసిన వర్షానికి నగరంలో చాలా మట్టుకు కాలనీలు,రోడ్లు చెరువులను తలపించేలా మారిపోయాయి. వర్ష ఉధ్రుతితో నాలాలు, చెరువులు పొంగిపొర్లుతుండడంతో.. కుత్భుల్లాపుర్,అల్వాల్,కూకట్‌పల్లి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. చాలా కాలనీలు జలమయం అవడంతో.. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని నాలా పొంగిపొర్లుతోంది. అలాగే తిరుమలగిరి లో భారీ వర్షం ధాటికి లోతట్టు ఇళ్లలోకి నీళ్లు చేరాయి.

Rain in city damages many roads

రోడ్లన్నీ చెరువలు గుంతలు

వానొచ్చిన ప్రతీసారి పరిస్థితి ఎలా తయారైందంటే.. ఏ లగ్జరీకారో, చేతి నిండా డబ్బులుంటే క్యాబ్ లోనో మాత్రమే బయటకు వెళ్లే పరిస్థితి. లేదంటే ఏ గుంత ఎక్కడుందో తెలియక.. చెరువలను తలపించే రోడ్ల మీద మ్యాన్ హోల్స్ ను తప్పించుకుని బయటపడడం నగర జీవుల సహనాన్ని పరీక్షిస్తోంది. వర్షాల ధాటికి కంకర తేలిన రోడ్లన్ని బురదమయంగానో.. గుంతల మయంగానో మారిన పరిస్థితి నగరంలో పలుచోట్ల కనిపిస్తోంది.

Rain in city damages many roads

ప్రయాణాలు వాయిదా

వర్షం ధాటికి రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో.. ప్రజలు తమ ప్రయాణాలను కొద్ది గంటల పాటు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ శాఖల నుంచే ఆదేశాలు జారీ అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Rain in city damages many roads

మెయిన్ రోడ్స్ పై గుంతలు

ప్రధాన రహదారుల్లో చాలా చోట్ల అడుగు నుంచి రెండు అడుగుల లోతు వరకు గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్ధీగా ఉండే లక్డీకాపూల్ మెయిన్ రోడ్డు, పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై కూడా రోడ్డుకు గుంతలు ఏర్పడ్డాయి. గుంతల వద్ధ వాహనాలు మెల్లిగా ప్రయాణించటం వల్ల అటు మాసాబ్‌ట్యాంక్ ఫ్లైవోవర్‌పై కింద, చౌరస్తా నుంచి బంజారాహిల్స్ వెళ్లే దారి, విజయనగర్‌కాలనీ వెళ్లే మెయిన్‌రోడ్లలో వాహానాలు క్యూ కడుతున్నాయి.

Rain in city damages many roads

ఇక్కట్లు పడుతోన్న వాహనాదారులు

గుంతల కారణంగా.. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతినటంతో బైక్ ప్రయాణిస్తూ ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే!

ఇక నగరంలోని విఐపి జోన్‌ పరిధిలో ఉన్న అన్ని మలుపుల వద్ధ రోడ్ల కొట్టుకుపోవటంతో పాటు ఎక్కువ మొత్తంలో బిటి మిశ్రమం పోగవ్వటంతో ద్విచక్ర వాహనదారులు బ్రేక్ వేసి జారి పడుతున్నారు.

Rain in city damages many roads

అధికారుల నిర్లక్ష్యం

రోడ్ల పరిస్థితి ఇలా తయారవడంలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా 53వేల పై చిలుకు గుంతలను గుర్తించామని కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటించిన కమిషనర్.. అందులో 4356 గుంతలు మినహా మిగిలిన వాటనన్నింటిని పూడ్చినట్లు తెలిపారు.

సికింద్రాబాద్ మహబూబ్‌కాలేజీ నుంచి బాటా వైపు వెళ్లే చౌరస్తాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గార్డెన్స్ హోటల్ ముందు రోడ్డంతా గుంతలమయం కావడం, పైగా మెట్రో పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు ముందుకు కదలడానికి గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్న పరిస్థితి

Rain in city damages many roads

మళ్లీ అదే పరిస్థితి :

గుంతలు పూడుస్తున్నామని చెబుతున్నారే గానీ.. పైపై పనులతోనే మమా అనిపిస్తుండడంతో.. పూడ్చిత గుంతలు చిన్న పాటి వర్షానికే మళ్లీ యథా స్థితికి వస్తున్నాయి. ఇక ప్రస్తుతం కొత్తగా గుర్తించిన 4356 గుంతలను పూడ్చేందుకు వాతావరణం సహకరించటం లేదని కమిషనర్ చెబుతున్నారు. కానీ తొమ్మిది వేల కిలోమీటర్ల మేరకున్న రోడ్లలో ఒక కి.మీకు రహదారి పైనే వేలల్లో గుంతలు దర్శనమిస్తుండడం గమనార్హం.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శివార్లలోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. అయిన లక్డీకాపూల్, మసాబ్‌ట్యాంక్ , మహావీర్ ఆస్పత్రి నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే రహదారిలో పిటిఐ భవన్ ముందు, హోటల్ ఉడ్‌బ్రిడ్జి ముందు రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారటంతో వాహనదారులు పడుతోన్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy rain damaged many roads in hyderabad. colonys are completely filled with rain water, drainages are over flowing, heavy traffic jams become headache for citizens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more