Rains: అకాల వర్షాలతో ఆగమవుతున్న రైతులు..
సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల, ఖాసీంపేట వానతో రైతులు నష్టపోయారు. కోతకొచ్చిన వరి కూడా దెబ్బతిన్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇల్లంతకుటంలో మండంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది.
పలు చోట్ల ఐకేపీ కేంద్రాల్లో వర్షపు నీరు చేరి వరి ధాన్యం తడిసింది. మరోవైపు ఈదురుగాలులకు మామిడి కాయలు కూడా రాలిపోయాయి. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు తాజా వర్షాలతో మరింత ఇబ్బందుల్లోకి వెళ్లారు. మొన్న శనివారం కూడా వర్షం పడింది.అకాల వర్షాలకు చేతికొచ్చి పంట వర్షర్పణం అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పిడుగు పడి ముత్యం మల్లేశం అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం సాయంత్రం తాళ్లు ఎక్కడానికి వెళ్లిన మల్లేశం తాటిచెట్టు కింద కత్తి నురుతుండగా ఒకేసారి పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

జగిత్యాల జిల్లా బీమారం మండలం గోవిందారంలో పిడుగు పడి 20 గోర్లు మృతి చెందాయి. అటు ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. వైయస్‌ఆర్ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. నిన్నటిదాకా ఆకుపచ్చగా కళకళలాడి ఎన్నో ఆశలను నింపి మంచి ఆదాయం వస్తుందని, కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆశించిన వారికి కన్నీరే మిగిలింది. నమ్ముకున్న పంట చేజారిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక తెలిపింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్ గడ్ నుంచి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తున ద్రోణి వద్ద కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
వానల సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉందని వివరించింది . పలు చోట్ల పిడుగుల పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.












Click it and Unblock the Notifications