16రాష్ట్రాల్లో వర్షాలు.. వారంరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వానలే.. కారణమిదే!
దేశవ్యాప్తంగా వేసవి కాలంలో అనేక రాష్ట్రాలలో ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి అంటే అతిశయోక్తి కాదు. ఎండలతో పాటుగా విపరీతంగా వీస్తున్న వడగాలులతో చాలామంది వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని 16 రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
వెస్ట్రన్ డిస్ట్రబెన్స్.. 16 రాష్ట్రాల్లో వర్షాలు
వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా వాతావరణంలో మార్పు వచ్చింది. దేశంలోని 16 రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, త్రిపుర, మిజోరం, మణిపూర్, కేరళ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బలమైన ఈదురు గాలులతో పాటు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

ఈ వారంలో ఈశాన్య భారతదేశంలో వర్షాలు
వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా మరో నాలుగైదు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈశాన్య భారతదేశంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు
ఇక ఈనెల 7వ తేదీ వరకు వాయువ్య భారతదేశంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఇదిలా ఉంటే గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి.
7 రోజులపాటు ఈ రాష్ట్రాలలో వర్షాలకు ఛాన్స్
మరోవైపు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, చత్తీస్గడ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, సౌత్ కర్ణాటక వంటి ప్రాంతాలలో గంటకు 40 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్టు వెల్లడించింది. ఈరోజు నుంచి శనివారం వరకు 7రోజులపాటు అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, యానం, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications