వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్నాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాక ప్రకటించింది. దీని కారణంగా శనివారం పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు పడ్డాయి.

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 37.5 మిల్లీమీటర్లు, వికారాబాద్‌లో 22.3, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్ మండలోని సింగపూర్ టౌన్‌షిప్‌లో, హైదరాబాద్‌లోని మైత్రివనంలో 20, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 14.3 మిల్లీమీటర్ల వర్షం పడింది.

Rains predicted in Telangana today and tomorrow

ఈదురు గాలుల కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు సూర్యుని భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్‌లో గరిష్టంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత .. హైదరాబాద్‌లో 38.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

English summary
Rains predicted in Telangana today and tomorrow due to a trough stretched about 1.5km from West Vidarbha to Coastal Karnataka covering Marathwada and Central Maharashtra, said Indian Meteorological Department .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X