‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024’.. జీవాంజితోపాటు వీరికే
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైనవారి పేర్ల జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు రాజ్‌భవన్ ఈ అవార్డులను ప్రకటించింది. జనవరి 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్నవారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం వెల్లడించారు.

సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులు ఉంటాయని, అవార్డు కింద కింద రూ. 2 లక్షలు, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
అవార్డులకు ఎంపికైనవారి వివరాలు:
పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి
దుశర్ల సత్యనారాయణ
అరికపూడి రఘు
ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, పీబీ కృష్ణభారతికి సంయుక్తంగా
ధృవాంశు ఆర్గనైజేషన్
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి
ఆదిత్య మెహతా ఫౌండేషన్
సంస్కృతి ఫౌండేషన్.












Click it and Unblock the Notifications