సందడి చేసిన రూ.12 కోట్ల 'రాజా'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాంలో అత్యంత వైబవంగా నిర్వంహించే సదర్ సమ్మేళనంలో దున్నపోతుల రాజసం ఉట్టిపడుతుంది. ఓక్కో దున్నపోతుది ఓక్కో ప్రత్యేకత. అది తినే ఆహరం నుండి చేసే ప్రతి పనికి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాదాపు రూ.12 కోట్ల విలువచేసే ఈ రాజా అనే దున్న నగరవాసులను ఆకట్టుకుంది. సికింద్రాబాద్ పార్శీగుట్ట, బాపూజి నగర్ కు చెందిన ఎడ్ల మల్లేష్ యాదవ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన శేర్ భాగ్ సింగ్ అనే రైతు నుండి అరుదైన జాతికి చెందిన 'రాజా' అనే దున్నపోతును సదర్ ఉత్సవాలకు హదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు. సదర్ ఉత్సవాల్లో ఈ 'రాజా' దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. మూడున్నర సంవత్సరాల ఈ దున్నపోతు.. 1800 వందల కిలోల బరువు. ఈ దున్నకు ఆహరం రోజుకు 5 కిలోల నెయ్యి, 40 లీటర్ల పాలు, 40 కిలోల యాపిల్స్ ను ఆహరంగా పెడుతున్నారు. స్నానానికి వాడే షాంపో ఖర్చు కిలో ఆరువేల రూపాయలు. ప్రతి రోజు 5 కిమీ నడక తప్పనిసరిగా చేయిస్తారు. నగరంలో జరిగే సదర్ ఉత్సవాల్లో ఈ రాజా ను తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని.. దున్నపోతు యజమాని అంటున్నారు. పంజాబ్ నుండి హైదరాబాద్ కు ప్రత్యేకమైన ఎసి కంటేనర్లో తీసుకు వచ్చారు. రోజుకు 50 వేల రూపాయలు ఈ దున్నపోతుకు కర్చు పెడతామని నిర్వహకుడు తెలిపారు. రాష్ట్రాంలోనే అత్యంత కరిదైన ఈ దున్న యదవులను, నగరవాసులను సదర్ ఉత్సవాల్లో ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications