రేవంత్ ఖబడ్దార్ : పర్సనాల్టీకి మించి : చంద్రబాబు డైరెక్షన్ లోనే : రాజగోపాల్ ఛాలెంజ్..!!

టీడీపీసీ చీఫ్ రేవంత పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని..ఆయన డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కోట్లాది రూపాయాలు బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ కు సిగ్గు ఉంటే తన పైన చేసిన ఆరోపణలు..కాంట్రాక్టులు నిరూపించాలని సవాల్ చేశారు. ఇప్పటికి నాలుగు పార్టీలు మారిన రేవంత్ నాయకత్వంలో తాము పని చేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో రేవంత్ పాత్ర లేదని చెప్పుకొచ్చారు.

రేవంత్ తెలంగాణ కోసం జైలుకు వెళ్లారా

రేవంత్ తెలంగాణ కోసం జైలుకు వెళ్లారా

రేవంత్ తెలంగాణ కోసం జైలుకు వెళ్లారా.. అవినీతి చేసి జైలుకు వెళ్లారంటూ మండిపడ్డారు. డబ్బులతో పీసీసీ చీఫ్ పదవి కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రణాళికా బద్దంగా టీడీపీని భూ స్థాపితం చేసి..కాంగ్రెస్ లోకి వచ్చారంటూ ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు నమ్మితే పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ గా అభివర్ణించారు. సోనియాను బలి దేవత అంటూ వ్యాఖ్యానించిన వీడియో ప్రదర్శించారు. నాడు కేసీఆర్ నుంచి ఆఫర్ ఉన్నా తాను పార్టీ మారలేదన్నారు. వైఎస్సార్ మరణించిన సమయంలో అందరూ భాద పడుతుంటే..ఆయన మరణం పైన దుర్మార్గంగా మాట్లాడారని గుర్తు చేసారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని మల్కాజ్ గిరి లో ఎంపీగా గెలిచారంటూ ఎద్దేవా చేసారు.

రేవంత్ వెనుక చంద్రబాబు

రేవంత్ వెనుక చంద్రబాబు

కేవలం 10 వేల ఓట్ల మెజార్టీతో గట్టెక్కారంటూ చెప్పుకొచ్చారు. టీడీపీకి తెలంగాణలో దుకాణం లేకపోవటంతో కాంగ్రెస్ లోకి వచ్చాడంటూ దుయ్యబట్టారు. పదవి కోసమో..డబ్బు కోసమో రాజకీయాలు చేయలేదని చెప్పిన రాజగోపాల్.. తాము ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశామన్నారు. తన పైన చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. నిరూపించకపోతే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం చేయాలని సవాల్ చేసారు. తాను రేవంత్ కు పీసీసీ ఇవ్వమని చెప్పలేదని..చెబితే రుజువు చేయాలని డిమాండ్ చేసారు. టీపీసీసీ చీఫ్ అయిన తరువాత తనతో కలుస్తానని చెబితే.. ఇటువంటి దుర్మార్గుడు తన ఇంటికి రావద్దని బయట కలిసామాని చెప్పుకొచ్చారు. వెంకటరెడ్డికి కు నచ్చ చెప్పమని అడిగారన్నారు.

రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్

రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్

కమిటీ మంచిగా వేద్దామని అనుకున్నామని రాజగోపాల్ చెప్పకొచ్చారు. రేవంత్ తన పైన చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ..రేవంత్ నీవు ఎన్ని అడుగులు ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు. నీ పర్సనాల్టీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావంటూ హెచ్చరించారు. పెయిడ వర్క్స్ ను పంపి జిందాబాద్ కొట్టించుకుంటారని..సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటారంటూ మండిపడ్డారు. రేవంత్ అసలు రాజకీయాలకు పనికొస్తారా అంటూ ప్రశ్నించారు. పదువులు రాకముందు దొంగతనాలు..దరువాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీపీసీసీ చీఫ్ అయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చాయని నిలదీసారు. మునుగోడులో రేవంత్ వస్తే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదంటూ రాజగోపాల్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+