తండ్రిలా కెసిఆర్ మందలింపు: రాజయ్య, వెంట కవిత
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తండ్రిలా మందలించే బాధ్యత ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. ఆయన బుధవారంనాడు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు.
రాజయ్య పర్యటిస్తున్న సమయంలో కొందరు పేషంట్లు కిందపడుకుని ఉన్నారు. వెంటనే స్పందించిన రాజయ్య ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత రోగుల వద్దకు వెళ్లి స్వయంగా ట్రీట్‌మెంట్ చేశారు. రాజయ్య వెంట నిజామాబాద్ తెరాస పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.

జానియర్ డాక్టర్లు సమ్మె విరమించుకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని రాజయ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేది లేదన జూనియర్ డాక్టర్లు అనడం బాధాకరమని ఆయన అన్నారు. నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
రాష్ట్రంోలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామని, అలాగే 500 పడకల స్థాయి ఆస్పత్రులను ఆధునీకరిస్తామని ఆయన చెప్పారు. మరిన్నీ ఆస్పత్రులకు 100 పడకల స్థాయికి పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కుక్క, పాము కాట్లకు మందు ఉందని చెప్పారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల ననుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఆస్పత్రిలో ఉండాలని ఆయన సూచించారు. జూనియర్ డాక్టర్లు సహాయకులు మాత్రమేనని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications