తెలంగాణ బిజెపి నేతలకు షాక్: కెసిఆర్‌తో దోస్తీకి రాజ్‌నాథ్ సింగ్ ఆప్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం నిజామాబాద్‌లో పాల్గొన్న తెలంగాణ విమోచన దినోత్సవ సంకల్ప సభలో సీఎం కెసిఆర్ పేరును ప్రస్తావించలేదు.

పవన్ కళ్యాణ్ అవసరంలేదు, నేను చాలు: వేణుమాధవ్, జగన్-రోజాలను తిట్టడంపై

రాజ్‌నాథ్ దాదాపు అరగంట పాటు మాట్లాడారు. కానీ కెసిఆర్ పైన లేదా తెలంగాణ ప్రభుత్వం పైన మాట్లాడలేదు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్‌తో దోస్తీకి ఇది సంకేతంగా కొంతమంది భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర నేతలు మాత్రం కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విమోచన దినం జరపాలని కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. రాజ్ నాథ్ తీరు తెలంగాణ బిజెపి నేతలకు షాక్ అంటున్నారు.

మరో కేంద్రమంత్రి మాత్రం

మరో కేంద్రమంత్రి మాత్రం

మరో కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఇక్కడి ప్రజల గొంతును అణగదొక్కిందన్నారు. ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.

తెలంగాణ ప్రజలకు వందనాలు అంటూ తెలుగులో..

తెలంగాణ ప్రజలకు వందనాలు అంటూ తెలుగులో..

ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగిందని, విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని చీల్చలేవని రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. సోదర, సోదరీమణులారా మీ అందరికీ నమస్కారం.. నిజామాబాద్‌ గడ్డపై నుంచి తెలంగాణ ప్రజలకు వందనాలంటూ ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

మోడీ పుట్టిన రోజు నాడే

మోడీ పుట్టిన రోజు నాడే

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినం ఇదే రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కావడం విశేషమని రాజ్‌నాథ్ అన్నారు. ఈ రోజును దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవం ఒక పండుగలాంటిదన్నారు. రజాకార్లతో పోరాటం చేసి అసువులు బాసిన వీరులకు శ్రద్ధాంజలి, ఇప్పుడు జీవించి ఉన్న అప్పటి యోధులకు తలవంచి నమస్కారాలు అన్నారు. విమోచన దినాన్ని బిజెపి అధికారికంగా నిర్వహించి తెలంగాణ ప్రజల కల సాకారం చేస్తుందన్నారు.

పాకిస్తాన్‌పై ఆగ్రహం

పాకిస్తాన్‌పై ఆగ్రహం

తాను హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో సరిహద్దుల్లో పాక్ సైన్యం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిందని, ఈ సంఘటన తెలియగానే తాను సైనిక ఉన్నతాధికారులతో మాట్లాడి ఇంత ఘోరం జరిగితే మనం బలం ఏం చేసిందని ప్రశ్నించానని తెలిపారు. మనది శాంతియుత దేశమని, మన వైపు నుంచి ముందు ఒక్క తూటా పేలకూడదని, పాక్ నుంచి ఒక్క తుపాకీ గుండు దూసుకు వచ్చినా లెక్కలేనన్ని తూటాలతో సమాధానం చెప్పాలని తాను సైనికాధికారులకు సూచించినట్లు చెప్పారు. చర్చల కోసం తాను 16సార్లు తెలుపు జెండా చూపించినా పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారన్నారు. ఉగ్రవాద సంస్థలు భారత్‌ను విచ్చిన్నం చేయాలని చూస్తున్నాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP is keeping its option open on the election strategy for Telangana in the 2019 elections. This was clearly indicated by Union home minister Rajnath Singh when he made no reference, forget any criticism, of the ruling TRS or Telangana chief minister K Chandrasekhar Rao during his 30-minute speech at the public meeting in TRS backyard Nizamabad to celebrate the liberation of Hyderabad state from Nizam rule 69 years ago.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X