భేటీతో క్లియర్: కేసు దర్యాప్తు ఎసిబికే, సెక్షన్ 8 వేరు..
న్యూఢిల్లీ: నోటుకు ఓటు కేసులో కేంద్రం జోక్యం చేసుకోదని, దర్యాప్తును తెలంగాణ ఎసిబికే వదిలేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గవర్నర్ నరసింహన్ భేటీలో ఈ విషయంపై కేంద్ర వైఖరి స్పష్టమైనట్లు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసును సెక్షన్ 8 నుంచి వేరు చేసి చూడాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసు విచారణను దర్యాప్తు సంస్థకే వదిలేయాలని కేంద్ర వైఖరిగా కనిపించినట్లు తెలుస్తోంది. సెక్షన్ 8, ఓటుకు నోటు కేసులను విడివిడిగా చూడాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసు దర్యాప్తు నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు, విద్వేషాలు పెరగకుండా చూడాలని రాజ్‌నాథ్ సింగ్ గవర్నర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. సెక్షన్ 8 అమలుపై రాజ్‌నాథ్ సింగ్ కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మాటల్లోనూ, మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యల్లోనూ నోటుకు ఓటు కేసులో కేంద్రం జోక్యం చేసుకోదనే విషయం వ్యక్తమైంది. ఓటుకు నోటు కేసు విషయంలో గవర్నర్‌కు తాము ఏ విధమైన సూచనలు కూడా చేయలేదని సదానంద గౌడ ఇప్పటికే స్పష్టం చేశారు.
సెక్షన్ 8 అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను గవర్నర్ నరసింహన్ రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. రాజ్‌నాథ్ సింగ్ గవర్నర్‌కు కేంద్ర వైఖరిపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications