బీజేపీ అధికారంలోకి వస్తే వారంతా జైలుకే..: కేసీఆర్ సర్కారుపై రాజ్‌నాథ్ సింగ్ ఫైర్
మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 27 సంవత్సరాలుగా గుజరాత్‌ను దేశంలోనే ఒక మోడల్‌గా అభివృద్ధి చేశామని.. తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్(KCR) కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్రమంత్రి విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తుందని భరోసా ఇచ్చారు. అటల్ బిహారీ వాజపేయి నుంచి, మోడీ వరకు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని తెలిపారు.
#WATCH | Medchal-Malkajgiri, Telangana: Defence Minister Rajnath Singh says, "We all say 'state first' while BRS says 'family first'. I want to tell you all that if the BJP forms its government here, then it won't be 'family first', it will be 'Telangana First'." pic.twitter.com/c5gOsF437a
— ANI (@ANI) November 24, 2023
తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. మోసం చేసి పేపర్ లీకేజ్‌లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్‌నాథ్. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని.. ఏ ఒక్క దళితుడికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుటుంబమే మొదటి ప్రాధాన్యత అని.. కానీ, బీజేపీ తెలంగాణ ప్రజలే మొదటి ప్రాధాన్యత అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని అభివృద్ధి దిశగా తెలంగాణ దూసుకెళ్తుందని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజలు తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications