సీఎం కేసీఆర్ కు ఐదు రాఖీలే - కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా

రాష్ట్రంలో కరోనా విజృంభణ, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వైరస్ బారిన పడుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో సోమవారం రాఖీ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఐదుగురు సొంత సోదరీమణులు మాత్రమే రాఖీ కట్టారు. రక్షా బంధన్ కట్టి, స్వీట్లు తినిపించుకున్న తర్వాత సోదరీమణులు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయిల నుంచి కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. మహిళా మంత్రులు, ఇతర నేతలెవరూ సీఎంను కలవలేకపోయాయి. అయితే..

ఈ ఏడాది ప్రగతి భవన్ రాఖీ వేడుకలో మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మహిళా మంత్రులు, టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఈసారి కేటీఆర్ లోనే కేసీఆర్ ను చూసుకున్నారు. ఉదయం సొంత సోదరి కవితతో రాఖీ కట్టించుకున్న కేసీఆర్.. మిగతా సమయాన్నంతా పార్టీ నేతల కోసమే కేటాయించారు. కేసీఆర్ కు ఆయన అక్కలు రాకీ కట్టిన సమయంలోనే మనుమడు(కేటీఆర్ కొడుకు) హిమాన్ష్‌కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది.

Raksha Bandhan:CM KCR and family celebrates fest at Pragathi Bhavan

అంతకుముందు, రాక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.

Raksha Bandhan:CM KCR and family celebrates fest at Pragathi Bhavan

కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈనెల 5న సమావేశం కానుంది. ప్రగతి భవన్ లోనే ఈ సమావేశం జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+