నాన్నకు ప్రేమతో..పై ఫైర్: ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
హైదరాబాద్: తెలుగు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోని కొన్ని దృశ్యాలను వ్యతిరేకిస్తూ శనివారం హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఓ సామాజిక వర్గంవారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోస్టర్లను ముద్రించారని, వెంటనే ఆ పోస్టర్లను తొలగించి సినిమాలోంచి ఆ దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు ఆ ర్యాలీ నిర్వహించారు.
జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో ఈ పోస్టర్లపై ఫిర్యాదు కూడా చేశామని వారు చెప్పారు. రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఓ వర్గం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆ తర్వాత మాసబ్‌ట్యాంకులోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. వందలాది మంది రోడ్డు మీదికి బైక్‌లతో రావడంతో బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ స్తంభించింది.
న్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.ను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications