అత్తారింట భార్యతో కలిసి హీరో రామ్ చరణ్: కోటపై ఆసక్తి, సైకిళ్ల పంపిణీ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి చూపించారు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో జరిగిన మహారుద్ర శత చండీ యాగంలో గురువారం సతీమణి ఉపాసనతో పాటు పాల్గొన్న ఆయన కోటలో అందాలను, కట్టడాలను తిలకించారు. వీటికి సంబంధించిన వివరాలను గైడ్ ను అడిగి తెలుసుకున్నారు.
హీరో రాంచరణ్ తేజ కోటకు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెర్రీ.. చెర్రీ.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భం గా అభిమానులకు హీరో హాయ్ అంటూ పలకరించారు. పోలీసులు, ప్రైవేటు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.
ఉమాపతి రావు, అనిల్, రాంచరణ్ తేజ 16 సైకిల్ రిక్షాలను పంపిణీ చేశారు. దోమకొండ గ్రామంలోని 16 వార్డుల్లో రోడ్లు శుభ్రంగా ఉంచేందుకు వీటిని అందజేసినట్లు రామ్ చరణ్ తేజ చెప్పారు. గతంలో ఆటో ట్రాలీ రిక్షాను మామయ్య కామినేని అనిల్ సహకారంతో అందించామని చెప్పారు.

కోటలో భవనాలకు మరమ్మతు పనులు పూర్తి అ య్యాయని సిబ్బంది తెలిపారు. రెండు నెలలు తర్వాత భవనాలను హీరో రాంచరణ్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో రాంచరణ్ తేజను దోమకొండ గ్రామస్తులు సన్మానిం చారు.
గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, మాజీ సర్పంచి ఐరేని నర్సయ్య, అనంతరెడ్డి, నల్ల పు శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, సాయబుగారి రాజు మధుసూదన్‌రెడ్డి, షమ్మీ, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications