Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ఎంఎస్ ధోనీ'లో ఆ పాత్రలో రామ్ చరణ్ తేజ, అందుకే సస్పెన్స్!

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోనీ చిత్రం వస్తోంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ విషయమై ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో సురేష్ రైనా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్.. విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.

Ram Charan Teja

కాగా, ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కథానాయకుడిగా నటించారు. భూమిక చావ్లా, కైరా అడ్వానీ, దిశా పఠానీ ప్రధాన పాత్రలు పోషించారు.

హిందీ, తెలుగు, తమిళ్‌, మరాఠీ భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో, టీజర్‌, ట్రైలర్‌లో రామ్ చరణ్‌ కనిపించలేదు. అయితే.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+