వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రకెక్కుతారు: డొనాల్డ్ ట్రంప్‌నీ వదలని వర్మ, ఆసక్తికర జోస్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి దేశాన్ని విడిచి పెట్టి ప్రపంచంపైనే పడ్డారు. ఇటీవలి వరకు పవన్ కళ్యాణ్, రజనీకాంత్‌లపై వ్యాఖ్యలు చేసిన వర్మ.. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న వ్యక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సారి తన కామెంట్లకు సెటైర్లు రాకూడదని అనుకున్నాడో ఏమో కానీ అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ భవితవ్యంపై జ్యోతిష్యం చెప్పారు రాంగోపాల్ వర్మ.

ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. అమెరికా అధ్యక్ష బరిలో ముందున్న ట్రంప్‌పై కూడా వర్మ తన శైలిని విడిచిపెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా భవిష్యత్ అంధకారమేనని సర్వేలు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.

అంతేగాక, ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా జీడీపీ 2 కి పడిపోతుందని ఫైనాన్షియల్ సంస్థలు ఆందోళన చెందుతున్న తరుణంలో వర్మ..ట్రంప్ పట్ల సానుకూలంగా స్పందించారు. ఎందుకో తనకు ట్రంప్ అమెరికా అధ్యక్షుల్లో గొప్ప అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారనిపిస్తుందని ట్వీట్ చేశారు.

Ram Gopal Varma on Donald Trump

అమెరికా చరిత్రలో నిలిచిపోయిన జాన్ ఎఫ్ కెన్నెడీ, అబ్రహాం లింకన్ ల సరసన చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోతాడనిపిస్తోందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. ట్రంప్ అభిమానులకు ఈ వ్యాఖ్యలు నచ్చేలావున్నా.. అతడ్ని వ్యతిరేకించే వారు మాత్రం వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.

English summary
Cine Actor Ram Gopal Varma responded on Donald Trump, nominee of the Republican Party for President of the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X