2050 నాటికి దేశంలో ఎవరూ రోగాలతో బాధపడకూడదు: రామ్‌దేవ్ బాబా
నిజామాబాద్: 2050 నాటికి దేశంలో ఎవరూ కూడ రోగాలతో బాధపడకూడదనేది తన ఉద్దేశ్యమని ప్రముఖ యోగ గురువు రామ్‌దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. రోగాల నుండి విముక్తిని పొందేందుకే తాను యోగాను 9 ఏళ్ళ వయస్సులోనే నేర్చుకొన్నానని ఆయన చెప్పారు. నిజామాబాద్‌లో జరిగే మూడు రోజుల ఉచిత యోగ ధ్యాన శిభిరంలో పాల్గొనాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కవిత, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావును రామ్‌దేవ్‌బాబా ఆహ్వనించారు.
మూడు రోజుల పాటు నిజామాబాద్‌లో యోగ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో యోగ నిర్వహణకు సంబంధించి రామ్‌దేవ్ బాబా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌కు వచ్చిన రామ్‌దేవ్ బాబా మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 10వ తేది నుండి మూడు రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలు జరగనున్నాయి.

తనలో శ్వాస ఉన్నంత వరకు తాను యోగ చేస్తానని రామ్‌దేవ్ చెప్పారు.పతంజలి వస్తువులను విక్రయించటం ద్వారా వచ్చే లాభాలను ఆరోగ్యం, చదువు కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఇందులో తనతో పాటు పతంజలి బాలకృష్ణ ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు.
సమాజంలో దళితులు కూడ భాగమన్నారు. వారిపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని రామ్‌దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశంలో దళితులు తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగరాదన్నారు. దీనిని సాకుగా కొందరు నేతలు, ఇతరులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దన్నారు. . లక్ష మంది విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీలో యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications