ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ 2 లీకేజి వ్యవహారం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల్లో ఏపీకి చెందిన షేక్ నిషాద్, ముంబైకి గుడ్డును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

మరోవైపు ఎల్‌బీ నగర్‌లోని రీసోరెన్స్ బీ మెడికల్ కోచింగ్ సెంటర్ యజమాని వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. తాజా అరెస్టులతో ఎంసెట్ 2 లీకేజి కేసులో మొత్తం ఏడుగురు నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గుడ్డుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ 2 పేపర్‌ను లీకేజి చేసి రాజగోపాల్‌ రెడ్డికి అందించడంలో షేక్ నిషాద్ కీలక పాత్ర పోషించాడు. ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ అధికారులు గురువారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. దీంతో ఎంసెట్-2 పరీక్షపై ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకోనుంది.

సంచలన సృష్టించిన ఎంసెట్ 2 లీకేజి వ్యవహారంలో కేసులో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, విష్ణు, రమేశ్, తిరుమల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

కాగా, ఢిల్లీ ప్రెస్ నుంచి పేపర్ లీకేజి అవడంతో రాజగోపాల్ రెడ్డితో పాటు కనిగిరికి చెందిన రమేశ్ కూడా కీలకపాత్ర వహించినట్లు సీఐడీ అధికారులు విచారణలో కనిపెట్టారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన రమేశ్ అనంతరం కోచింగ్ సెంటర్ల వద్ద దళారీగా వ్యవహరించేవాడని తెలిసింది.

ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి మొత్తం 160 క్వశ్చన్లతో కూడిన ప్రశ్నాపత్రాన్ని ప్రత్యేక జిరాక్స్ మిషన్‌లో తీయించి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశ్నాపత్నం ఇచ్చినందుకు గాను ఒక్కో విద్యార్ధి నుంచి రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు అగ్రిమెంట్ కుదుర్చుుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎంసెట్ 2 లీకేజి కేసు వ్యవహారంలో మొత్తం 69 మంది విద్యార్ధులు లబ్ధి పొందినట్లుగా తెలుస్తోంది. ఈ లీకేజి డీల్ విలువ మొత్తం రూ. 50 కోట్లు. ఎంసెట్ 2 పేపర్ లీకేజిలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు అతని ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అదుపులోకి పోలీసులు విచారిస్తున్నారు.

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు, చేరవేతలో అతడు కీలక పాత్ర వహించినట్లు విచారణలో వెల్లడైంది. గత కొంతకాలంగా ఇలాంటి వ్యవహారాలనే ఇతడు నడిపినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన రమేష్ ఇరవై ఏళ్ల క్రితమే స్వస్థలాన్ని వదిలి హైదరాబాద్ ఉప్పల్ లో ఉంటున్నాడు.

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

ఇతడికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఒకరు డాక్టర్ కాగా, మరొకరు నేవీ ఉద్యోగిగా చేస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు తొలుత కనిగిరికి చెందిన ఖాశింను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి, అనంతరం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఇతడు రమేశ్ భార్య సోదరి కుమారుడు కావడం విశేషం.

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

రమేష్‌కు ఫోన్ కాల్ లిస్ట్‌లో ఎక్కువసార్లు ఖాశిం నెంబర్ ఉండటంతో సీఐడీ అధికారులు అతని కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు రమేష్ తరచూ కనిగిరిలో బస చేసే కందుకూరు గ్రానైట్ వ్యాపారికి చెందిన కనిగిరి గెస్ట్ హౌస్‌ను కూడా సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు.

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

ఎంసెట్ 2: ఢిల్లీ ప్రెస్ నుంచి లీక్ చేసింది షేక్ నిషాద్, డబ్బులు చేరవేసింది రమేశ్

ఎంసెట్‌ 2 పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని ర్యాంకు సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెక్రటేరియట్‌లో గురువారం మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి.. పరీక్ష కోసం తాము పడిన కష్టాన్ని, రద్దు చేస్తే కలిగే నష్టాలను వివరించారు. లీకేజీకి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telangana crime investigation department (CID) has arrested four persons in connection to the leakage of the question paper of a medical entrance examination held in the state on July 9. They also claim to have arrested the racket’s kingpin, R G Rajagopal Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి