బ్రతికుండగానే స్మారకం నిర్మించుకున్న రామోజీరావు సాహసం; లెజెండ్ అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!

మరణం.. ఇది ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఆందోళనకు గురిచేస్తుంది జీవితం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు మరణాన్ని గౌరవించాలని రామోజీరావు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. జీవించి ఉండగానే సొంతగా స్మారకాన్ని నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు ప్రతి ఒక్కరికి తనదైన సందేశాన్ని ఇచ్చి వెళ్లారు.

రామోజీరావు చేసిన ఆశ్చర్యకరమైన పని
సహజంగా మనమంతా జీవితాన్ని ప్రేమించినంతగా మరణాన్ని ప్రేమించలేము. చావు పుట్టుక రెండే నిజం.. మధ్యలోదంతా నాటకం అని నమ్మిన వ్యక్తి రామోజీరావు. అందుకే ఆయనకు చావంటే భయం లేదు. ఎప్పటికైనా తాను చనిపోతాను అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెబుతూ ఆయన చేసిన ఒక పని అందరినీ ఆలోచించేలా చేస్తుంది..

Ramoji Rao was the only person who built his monument while alive President Draupadi Murmu condolences

జీవించి ఉండగానే స్మారకం నిర్మించుకున్న రామోజీరావు
జీవించి ఉండగానే సొంతంగా తన స్మారకాన్ని నిర్మించుకున్నారు రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన తన కోసం నిర్మించుకున్న స్మారకం ఆయనకు మరణంపై ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తుంది. బ్రతికుండగానే నిర్మించుకున్న ఏకైక వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రతి మనిషికి మరణం కూడా ఒక వరమని చెప్పిన మహనీయుడు రామోజీరావు.

చావంటే భయం లేదన్న రామోజీరావు
నాకు చావంటే భయం లేదు అని చెప్పిన ఆయన స్మారకాన్ని బ్రతికుండగానే నిర్మించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం. అయితే ప్రస్తుతం రామోజీరావు తన స్మారకాన్ని తానే నిర్మించుకున్నారు అన్న వార్తలతో ఆయన అభిమానులకు ఆయన పైన గౌరవం మరింత పెరిగింది.

రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతిక కాయం.. సందర్శిస్తున్న అభిమానులు
రామోజీ ఫిలిం సిటీకి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడం కోసం అశేష జనవాహిని బారులు తీరారు. రామోజీ ఫిలిం సిటీ లో తెలుగు రాష్ట్రాలను ఠీవిగా ప్రపంచ వేదికపై రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా నిలబెట్టిన మహానుభావుడు స్మారకం ఉంటుందని, రామోజీ వారసత్వం కొనసాగుతుందని, రామోజీరావు చేసిన సేవలను భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చాలామంది చెబుతున్నారు.

రామోజీ మరణం పట్ల సంతాపం తెలిపిన రాష్ట్రపతి
ఇదిలా ఉంటే రామోజీరావు మరణం పట్ల ప్రముఖులు తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే మోడీ ట్వీట్ చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాపాన్ని తెలియజేశారు. రామోజీరావు మరణంతో మీడియా, వినోద రంగం ఓ లెజెండ్‌ను కోల్పోయిందన్నారు. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త ఆయన.

మీడియా, సినీ పరిశ్రమలకు రామోజీ సేవలు చిరస్మరణీయం
తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. పద్మవిభూషణ్‌ సత్కారం అందుకున్నారన్నారు. మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+