'కుదురుపాక' శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహానీ: రమ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య ఆరోపించారు.
శనివారం రమ్య విలేకరులతో మాట్లాడారు. రమ్య.. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న కుమార్తె. ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అమె పలుమార్లు కేసీఆర్ పైన విమర్శలు చేశారు.

ఇప్పుడు కేసీఆర్‌కు ప్రాణహానీ ఉందని చెప్పడం గమనార్హం. తమిళనాడులానే తెలంగాణలోనూ 'కుదురుపాక'కు చెందిన కొందరు కోటరీగా ఏర్పడ్డారని ఆరోపించారు.
వారివల్ల కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, ముఖ్యమంత్రి భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తమిళనాడులో శశికళ నేతృత్వంలోని మన్నార్ గుడి పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications