చిట్టితల్లి రమ్యకు చివరి ముద్దు: తల్లి కన్నీరుమున్నీరు(పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో ఈ నెల 1వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య(9) కేర్‌ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం కన్నుమూసింది. రమ్యను చూసేందుకు ఆమె తల్లి ఆదివారం ఆస్పత్రికి చేరుకుంది. దీంతో, అక్కడ గంభీర వాతావరణం కనిపించింది.

ఇదే ప్రమాదంలో రమ్య తల్లి తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రమ్య మరణవార్త తెలియడంతో ఆమెను అంబులెన్స్‌లో కేర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తమ గారాలపట్టి విగతజీవిగా మారడాన్ని చూసి ఆమె విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

కారుపై పడిన కారు: చిన్నారి రమ్య బ్రెయిన్ డెడ్, అవయవదానం

చిన్నారి రమ్య భౌతిక కాయాన్ని మరణానంతరం పరీక్షలకు తరలిస్తున్న సమయంలో తల్లి రాధికను అంబులెన్సు నుంచి కిందకు దిగలేకపోయింది. ఆమెకు బాగా గాయాలయ్యాయి. కూతురు మృతదేహాన్ని చూసి విలవిలలాడింది. అంబులెన్సు నుంచి బలంగా కిందక వంగి కూతురుకు చివరి ముద్దు పెట్టింది. ఓ వైపు చనిపోయిన కూతురు, మరోవైపు భార్య పరిస్థితి ఇలా ఉండటంతో... తండ్రి మౌనంగా రోదించారు.

ఒకటో తేదీన రమ్య తొలిరోజు పాఠశాలకు వెళ్లి తన తల్లి, రాధిక, బాబాయిలు రమేష్‌, రాజేష్‌, తాత మధుసూదనాచారితో కలిసి బంజారాహిల్స్‌ వైపు కారులో వస్తుండగా, మరోకారులో తప్పతాగిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు వస్తున్నారు.

ఆ తల్లికి గుండెకోత: కారుపై పడిన కారు, 9రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య

ఆ సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కారు ఎగిరి రమ్య కుటుంబం ఉన్న కారు పైన పడింది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. రమ్యను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. రమ్య బ్రెయిన్‌ డెడ్ అయింది.

తల్లడిల్లిన తల్లిదండ్రులు

తల్లడిల్లిన తల్లిదండ్రులు

తన కూతురు రమ్య చనిపోయిన విషయం తెలియగానే తల్లి రాధిక హృదయం తల్లడిల్లింది. చిట్టితల్లిని కడసారిగా ఒళ్లోకి తీసుకోవాలని, తనివితీరా ముద్దాడాలని ఆశపడింది. శక్తినంతా కూడదీసుకొని అంబులెన్సు పైనుంచే తన చిన్నారి రమ్య నుదుటిపై కడసారి ముద్దు ఇచ్చారు.

చెల్లి పిలిచినా రాలేదు!

చెల్లి పిలిచినా రాలేదు!

లే.. అక్కా.. పార్కులో ఆడుకుందాం... అంటూ రమ్య చెల్లి రేష్మ పిలుపులు అందర్నీ కదలించాయి. తప్పతాగి, ఆ మత్తులో కారు నడిపి నాలుగు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

నాయకుల సంతాపం

నాయకుల సంతాపం

కాగా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, బీజేఎల్పీ నాయకుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మంత్రి కెటిఆర్ తదితరులు రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమ్య ప్రాణాలను బలితీసుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కెటిఆర్ చెప్పారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదని చెప్పారు.

తరలి వచ్చిన జనం

తరలి వచ్చిన జనం

రమ్య మృతి చెందిందనే విషయం తెలిసిన జనం పెద్ద ఎత్తున చేరారు. తల్లి మనోవేదన అక్కడున్న వారందరినీ కదలించింది. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం అమ్మమ్మ, తాతయ్య నివాసం ఉండే అంబర్‌పేట డివిజన్‌లోని డీడీ కాలనీకి తరలించారు.

తల్లి ఆవేదన

తల్లి ఆవేదన

ఆ రోజు రమ్యను స్కూలు నుంచి తీసుకువస్తున్నాం. రహదారిలో రంజాన్‌ ప్లెక్సీని చూసి అదేమిటమ్మా అని అడిగింది. నేను రంజాన్‌ పవిత్రత గురించి రమ్యకు చెప్పాను. ఇంతలోనే పెనుప్రమాదం సంభవించింది. నా బంగారు రమ్య బొమ్మలను చూసిందంటే మరో నిమిషంలో ఆ బొమ్మలను వేసి చక్కటి రంగులు అద్దేది. చదువులోనూ మెరికే. నా చిన్నారి రమ్య లేని జీవితమే వృథా' అని తల్లి రాధిక కన్నీరుమున్నీరు అయింది.

రమ్య

రమ్య

కూతురు మృతదేహాన్ని చూసి విలవిలలాడింది. అంబులెన్సు నుంచి బలంగా కిందక వంగి కూతురుకు చివరి ముద్దు పెట్టింది. ఓ వైపు చనిపోయిన కూతురు, మరోవైపు భార్య పరిస్థితి ఇలా ఉండటంతో... తండ్రి మౌనంగా రోదించారు.

ప్రమాదం

ప్రమాదం

ఒకటో తేదీన రమ్య తొలిరోజు పాఠశాలకు వెళ్లి తన తల్లి, రాధిక, బాబాయిలు రమేష్‌, రాజేష్‌, తాత మధుసూదనాచారితో కలిసి బంజారాహిల్స్‌ వైపు కారులో వస్తుండగా, మరోకారులో తప్పతాగిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు వస్తున్నారు.

ప్రమాదం

ప్రమాదం

ఆ సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కారు ఎగిరి రమ్య కుటుంబం ఉన్న కారు పైన పడింది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. రమ్యను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. రమ్య బ్రెయిన్‌ డెడ్ అయింది.

ప్రమాదం

ప్రమాదం

దీంతో ఆమెను వెంటిలెటర్ పైన ఉంచారు. పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం రమ్య ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.

రమ్య

రమ్య

కూతురు మృతదేహాన్ని చూసి విలవిలలాడింది. అంబులెన్సు నుంచి బలంగా కిందక వంగి కూతురుకు చివరి ముద్దు పెట్టింది. ఓ వైపు చనిపోయిన కూతురు, మరోవైపు భార్య పరిస్థితి ఇలా ఉండటంతో... తండ్రి మౌనంగా రోదించారు.

దీంతో ఆమెను వెంటిలెటర్ పైన ఉంచారు. పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం రమ్య ప్రాణాలు విడిచింది. రమ్య మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రమ్యకు అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ: మహేందర్ రెడ్డి

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిపించాలని కోరుతామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితులపై ప్రమాదం కేసుకు బదులుగా.. ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు.

ప్రమాద సమయంలో నిందితులు మద్యం తాగి ఉన్నట్లు ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలు లాంటి సాక్ష్యాలు సేకరించామన్నారు. మైనర్లకు మద్యం విక్రయించిన బార్ నిర్వాహకుల పైన చర్యలు కోసం ఎక్సైట్ శాఖకు నివేదిక సమర్పించామని చెప్పారు.

నిందితుడు శ్రావిల్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఎంవీ యాక్టు కింద మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఇంజినీరింగ్ విద్యార్థులు శ్రావిల్, విష్ణు, సూర్య, అశ్విన్, సాయి రామణ, అలెన్ జోసెఫ్‌లు వస్తున్న కారు రమ్య కారును ఢీకొట్టింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
City police commissioner M. Mahender Reddy on Sunday said that the drunk driving accident case in which eight-year-old P, Ramya and her uncle died, would be taken to the fast- track court and the police would ensure maximum punishment to the suspect.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి