స్నేక్ గ్యాంగ్ రేప్ కేసు: 8మంది దోషులు, ఒకరికి ఊరట, అత్యాచారంపై ట్విస్ట్
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది. ఎ9 సలాహం హందీ పైన కేసును న్యాయస్థానం కోట్టి వేసింది. జిల్లా న్యాయస్థానం నిందితులకు శిక్షను బుధవారం నాడు ఖరారు చేయనుంది.
అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్. స్నేక్ గ్యాంగ్‌కు కోర్టులో ఒకింత ఊరట లభించిందని చెప్పవచ్చు. బాధితులకు విస్మయాన్ని కలిగిస్తూ.. వీరెవరూ అత్యాచారాలకు పాల్పడినట్టు ఆధారాలు లేవని జడ్జి వ్యాఖ్యానించారు. వీరు లైంగిక దాడులు చేశారని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందన్నారు.
కేవలం దోపిడీ, అసభ్య ప్రవర్తన ఆరోపణలపైనే వీరు ముద్దాయిలుగా తేలారని వెల్లడించారు. వీరికి శిక్షలను బుధవారం ఖరారు చేస్తామని జడ్జి పేర్కొన్నారు. దాదాపు 37 జంటలపై దాడులకు దిగిన వీరిపై కనీసం ఒక్క అత్యాచార ఆరోపణనైనా పోలీసులు నిరూపించలేక పోయారని పలువురు కోర్టు ప్రాంగణంలోనే విమర్శించారు.
కాగా, హైదరాబాద్ శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ కేసు తుది తీర్పు మంగళవారం వెలువడనుంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 జులై 31న స్నేక్ గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్‌లో చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నాడు సంచలనం సృష్టించింది.
పోలీసులు నిందితులపై భారత శిక్షా స్మృతి 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కేసులో తొమ్మిది మంది నిందితులపై కోర్టులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు.

ఫైసల్ దయాని (ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ (ఉస్మాన్‌నగర్), తయ్యబ్ బసలమ (బండ్లగూడ,బార్కాస్), మహ్మద్ పర్వేజ్ (షాయిన్‌నగర్), సయ్యద్ అన్వర్ (షాయిన్‌నగర్), ఖాజా అహ్మద్ (ఉస్మాన్‌నగర్), మహ్మద్ ఇబ్రాహీం (షాయిన్‌నగర్), అలీ బరాక్బ (షాయిన్‌నగర్), సలాం హందీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా చూపించారు.
ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసు తుది తీర్పు నేడు వెలువడుతున్న సందర్భంగా పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టుల వద్ద భారీ బందోబస్తుకు సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications