ఆదిభట్ల కిడ్నాప్ కేసు: యువతి సేఫ్, 8 మంది అరెస్ట్, నవీన్ రెడ్డి కోసం గాలింపు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మన్నెగూడ శుక్రవారం ఉదయం సినీ ఫక్కీలో కిడ్నాప్‌నకు గురైన యువతి కథ సుఖాంతమైనట్లు తెలుస్తోంది. తాను క్షేమంగా ఉన్నట్లు తండ్రి దామోదర్ రెడ్డికి ఆమె ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో ఇప్పటికే కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. యువతి ఫోన్ చేసిన సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా నల్గొండలో ఉన్నట్లు గుర్తించారు.

ఆదిభట్ల యువతి సేఫ్

ఆదిభట్ల యువతి సేఫ్

ఈ మేరకు నల్గొండ పోలీసులను రాచకొండ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను పోలీసులు గుర్తి స్టేషన్‌కు తీసుకెళ్లారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న రాచకొండ ఏసీపీ సుధీర్ బాబు.. ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో అన్ని వివరాలు చెబితే కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు.

ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్?

ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్?

కాగా, యువతిని అపహరిస్తున్న సమయంలో వెంబడించిన పోలీసులు ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులోనే నిందితుల వాహనాన్ని అడ్డుకుని నవీన్ రెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పోలీసులు అధికారిక దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, యువతిని మాత్రం కాపాడినట్లు పోలీసులు చెప్పారు. యువతి తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని పోలీస్ స్టేషన్ నుంచే చెప్పినట్లు తెలిసింది.

వందమందికిపైగా యువతి ఇంటిపై దాడి, కిడ్నాప్

వందమందికిపైగా యువతి ఇంటిపై దాడి, కిడ్నాప్

అంతకుముందు శుక్రవారం ఉదయం మన్నెగూడలో కుటుంబసభ్యులపై దాడి చేసి, ఇంటిని ధ్వంసం యువతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. డీసీఎం, కార్లలో 100 మందికిపైగా యువకులతో వచ్చిన నవీన్ రెడ్డి.. తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని దామోదర్ రెడ్డి, నిర్మల దంపతులు తెలిపారు. ఇంట్లోని సామాగ్రి, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారని చెప్పారు. తమపైనా దాడి చేశారని వాపోయారు.
గతంలో నవీన్ రెడ్డి ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు యువతి కుటుంబసభ్యులు తెలిపారు. అయినప్పటికీ నవీన్ రెడ్డి తన వేధింపులు ఆపలేదన్నారు. పోలీసుల అండతోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఇంటిపై దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులు, 100 నెంబర్ కు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్ రహదారిపై యువతి కుటుంబసభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

నవీన్ రెడ్డి దాడులకు తెగబడ్డారంటూ యువతి తల్లిదండ్రులు

నవీన్ రెడ్డి దాడులకు తెగబడ్డారంటూ యువతి తల్లిదండ్రులు

మరోవైపు, యువతి కిడ్నాప్ విషయం తెలసుకున్న బంధువుల భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. యువతి ఇంటి ముందే ఏర్పాటు చేసిన నవీన్ రెడ్డికి చెందిన టీ స్టాల్ కు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్తితి ఏర్పడింది.నిందితుడు అక్కడే ఉంటూ యువతిని, ఆమె కుటుంబసభ్యులను దాదాపు ఏడాదికాలంగా వేధిస్తున్నాడని బంధువులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, తమ కుమార్తెతో పెళ్లికి నిరాకరించినందుకే నవీన్ రెడ్డి ఇలా దారుణాలకు తెగబడ్డాడని వాపోయారు యువతి తల్లిదండ్రులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం యువతి పోలీసుల దగ్గరే క్షేమంగా ఉందని సమాచారం రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+